సోమవారాన్ని పోలవారంగా మార్చి ప్రతివారమూ సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు ఈ సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా స్పిల్‌వే, లోయర్‌ కాపర్‌ డ్యామ్‌ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘‘పోలవరం ప్రాజెక్టు పనులు 59.6శాతం పూర్తి. ఈనెల 24 నాటికి లోయర్‌ కాపర్‌ డ్యామ్‌ జెట్‌ గ్రౌంటింగ్‌ పనులు పూర్తి. డిసెంబర్‌ నుంచి గేట్లు ఏర్పాటు చేసే పనులు ప్రారంభిస్తాం. రూ.9870కోట్లకు సంబంధించి కేంద్రానికి నివేదికలు ఇచ్చాం. కృష్ణా డెల్టాకు ఈ సీజన్‌లో 73 టీఎంసీల నీరు మళ్లించాం. వచ్చే మే నాటికి కుడి, ఎడమ కాల్వల ద్వారా నీరందిస్తాం’’ అని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో దిగువ కాఫర్‌ డ్యాంకు సంబంధించి గతవారానికి మిగిలిన 154 మీటర్ల జెట్‌ గ్రౌటింగ్‌ పనులను నిర్మాణ సంస్థ యుద్ధప్రాతిపదికన చేపట్టింది.

polavaram 22102018 2

సుమారు 1620 మీటర్ల మేరకు జెట్‌ గ్రౌటింగ్‌ పూర్తి చేయాలి. కానీ మధ్యలో పనుల్లో జాప్యం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చూపరాదన్న ప్రభుత్వ ఆదేశంతో... జెట్‌ గ్రౌటింగ్‌ను సోమవారానికి పూర్తి చేయనున్నారు. ఇప్పటిదాకా ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో 59.32శాతం పనులు పూర్తి అయ్యాయి. వాస్తవానికి ఎట్టి పరిస్థితుల్లోనూ దసరా నాటికి 48వ పిల్లర్‌ వద్ద ప్రయోగాత్మకంగా ఒక గేటును అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ సాధ్యంకాలేదు. ఒకటికి రెండుసార్లు సమీక్షించి వెంటనే నిర్మాణ పనిని పూర్తి చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే డిజైన్ల అనుమతిలో ఉన్న ఆటంకాలు తొలగకపోవడం, ప్రతిదానికీ సీడబ్ల్యూసీ కొర్రీలు పెట్టడంతో పోలవరంపై కేంద్రం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని సీఎం చంద్రబాబు ఇటీవల ఆరోపించారు.

polavaram 22102018 3

దీనికి తగ్గట్టుగానే కొన్ని పనుల విషయంలో పురోగతి కనిపించడంలేదు. మెయిన్‌ డ్యాం 45.80% పూర్తికాగా స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌, అప్రోచ్‌ చానల్‌, పైలెట్‌ చానల్‌లలో 79% పనులు పూర్తయ్యాయి. రేడియల్‌ గేట్ల విషయంలో 61.85% పురోగతి నమోదు చేయగా.. డయాఫ్రమ్‌ వాల్‌ వందశాతం, కాంక్రీట్‌ 56.6%, కుడికాలువ 90%, ఎడమకాల్వ 64.22% పనులు పూర్తయ్యాయి. నదుల అనుసంధానం ద్వారా పవిత్ర సంగమానికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు తెలిపారు. నీటి భద్రత అనేది ప్రభుత్వ విధానమని, పట్టిసీమ రాకపోతే కృష్ణా డెల్టా ఎండిపోయేదన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read