ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 11వ గ్లోబల్ అగ్రికల్చరల్ లీడర్‌షిప్ అవార్డును అందుకోనున్నారు. బుధవారం, అక్టోబర్ 24న ఢిల్లీలో జరిగే 11వ అంతర్జాతీయ వ్యవసాయ నాయకత్వ సదస్సులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ అవార్డును ఆయనకు అందజేస్తారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్, కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం చాన్సలర్ ఆర్బీ సింగ్, నాబార్డ్ చైర్మన్ హెచ్‌కే బన్వాలా తదితరులతో కూడిన కమిటీ చంద్రబాబును నాయకత్వ పురస్కారానికి ఎంపిక చేసింది. కొద్ది రోజుల క్రితం ఈ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.
వ్యవసాయం, దాని అనుబంధ రంగాల సమస్యలను పరిష్కరించి వినూత్న విధాన నిర్ణయాలను ప్రకటించడం ద్వారా వ్యవసాయదారుల జీవితాల్లో చెప్పుకోదగిన మార్పును తీసుకొచ్చినందుకు ఆయనకు ఈ అవార్డును ఇవ్వనున్నట్లు సదస్సు నిర్వాహకులు తెలిపారు. కాగా.. సేంద్రియ వ్యవసాయంలో కొత్త ఆవిష్కరణలు ప్రవేశపెట్టినందుకు నాయకత్వ పురస్కారాన్ని ఏపీకి చెందిన రైతు గద్దె సతీశ్‌బాబును ఎంపిక చేశారు. హైదరాబాద్‌కు చెందిన నాగార్జున ఆగ్రో కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్.. వ్యవసాయ, వ్యాపార పురస్కారానికి ఎంపికైంది.
ఇది ఇలా ఉంటే, ఎప్పుడు రాష్ట్రానికి, చంద్రబాబుకి ఏదన్నా మంచి పని చేసి ప్రచారం వస్తుందని తెలిస్తే చాలు, ఇటు పవన్ కళ్యాణ్ కాని, అక్కడ నుంచి జీవీఎల్ కాని రంగంలోకి దిగుతారు. జీవీఎల్ అయితే ఏ మాత్రం మొహమాటం కూడా లేకుండా, తప్పుడు ప్రచారం చేస్తూ, చంద్రబాబు పై విష ప్రచారం చేస్తారు. ఉదాహరణకు చంద్రబాబు ఐక్యరాజ్య సమితి వెళ్ళే సమయంలో, ఆహ్వానం అందకుండా కొనుక్కుని వెళ్తున్నారని ఒకసారి, అసలు ఆహ్వానం పంపించిన ఐక్యరాజ్యసమితి డైరెక్టర్ దొంగోడు అని ఒకసారి ప్రచారం చేస్తూ, ఆ ఎపిసోడ్ మొత్తం రక్తి కట్టించాడు. మరి ఈ సారి ఏకంగా, వాళ్ళ నాయకుడు, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అవార్డు ఇస్తున్నారు, మరి జీవీఎల్ ఏమి చేస్తారో.