తెలంగాణా ఎన్నికల వాతావరణం వచ్చినప్పటి నుంచి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై, కేసీఆర్ ఎలా చిందులు తోక్కుతున్నారో చూస్తున్నాం. తన పాలన గురించి చెప్పుకుని, ఓట్లు అడగటం చేత కాక, చంద్రబాబు పై వ్యక్తిగతంగా కూడా దాడి చేస్తున్నారు. తెలంగాణా - ఆంధ్రా సెంటిమెంట్ రగిలించి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో, చంద్రబాబుని తెలంగాణా ద్రోహిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా, చంద్రబాబుని అనరాని మాటలు అంటున్నారు కేసిఆర్. చివరకు బూతులు కూడా తిడుతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మరో రాష్ట్ర ముఖ్యమంత్రి పై ఈ రకంగా దిగాజరి పోయి మాటల దాడి చెయ్యటం ఎప్పుడూ లేదేమో.

kcr 22102018 2

అయితే ఇది ఇలా ఉండగానే, ఇప్పుడు సడన్ గా కేసీఆర్ కు చంద్రబాబులోని పోజిటివ్ యాంగిల్ కనిపించింది. అందుకే చంద్రబాబుని చూసి నేర్చుకోండి అంటూ, తన శ్రేణులకి పిలుపిచ్చారు. అంతే కాదు, తాను ఎప్పుడూ పొగిడే జగన్ మోహన్ రెడ్డిలా ఉండద్దు అంటూ తన శ్రేణులకి చెప్పారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు వెళితే.. జగన్‌ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ఓటమి పాలయ్యారని, ఇది గుర్తుంచుకోవాలి అంటూ చెప్పారు. ఆనాడు చంద్రబాబు అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు తెలంగాణలో అమలు చేయాలని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.

kcr 22102018 3

చంద్రబాబు ఫార్ములాను, మీరు కూడా ఫాలో అవ్వండి, ఎక్కడా జగన్ లాగ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ వద్దు, చంద్రబాబులాగా పధ్ధతిగా కొట్టండి అంటూ పిలుపు ఇచ్చారు కెసిఆర్. ‘‘అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రయోజనం పొందిన ప్రతి లబ్ధిదారుడిని ఆ పార్టీ నేతలు కలిశారు. మొదటి గంటలోనే వారిని పోలింగ్‌ బూత్‌కు రప్పించారు. ఆ తర్వాత ప్రత్యర్థి పార్టీ శిబిరంపై కన్నేశారు. లబ్ధిదారులందరినీ పోలింగ్‌ బూత్‌కు రప్పించడం ద్వారా ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఇప్పుడు మీరూ అదే వ్యూహాన్ని అనుసరించాలి. ప్రతి ఒక్క లబ్ధిదారుడిని కలవాలి. మొదటి గంటలోనే పోలింగ్‌ బూత్‌కు తీసుకు రావాలి’’ అని పార్టీ అభ్యర్థులకు కేసీఆర్‌ సూచించారు. అప్పట్లో జగన్‌ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో వ్యవహరించి ఓటమి పాలయ్యారని, అందువల్ల నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read