తిత్లీ తుపాను ధాటికి అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాను సామాన్య స్థితికి తీసుకొచ్చేందుకు యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తోంది. గురు, శుక్రవారాలు విజయదశమి పూజలు ఉన్నప్పటికీ యంత్రాంగం నిర్విరామంగా విధుల్లో పాల్గొన్నారు. విద్యుత్తు సరఫరా పునరుద్ధరించేందుకు విద్యుత్తు శాఖ సిబ్బంది చేస్తున్న కృషికి స్థానికుల నుంచి మద్దతు లభిస్తోంది. ఎక్కడికక్కడ గ్రామాల్లో సిబ్బందికి భోజనాలు ఏర్పాటు చేస్తూ తమ వంతు సాయంగా నిలుస్తున్నారు. మా కోసం కుటుంబాలని వదిలేసి, పండగ రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నారని, మేము ఇలా కృతజ్ఞత తెలుపుకుంటున్నామని అన్నారు. పగలంతా విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నా రాత్రిపూట ప్రధానంగా మండల కేంద్రాలకు సరఫరా అందిస్తున్నారు.

relief 20102018 2

గురు, శుక్రవారాల్లో జరిగిన పనితో 50 శాతం గ్రామాలకు విద్యుత్తు సరఫరా పునరుద్ధరించగలిగారు. మరోవైపు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పంటపొలాలను పరిశీలించి నష్టం అంచనా ప్రక్రియ చేపట్టారు. పంట పరిహారం ఈ నెల29 కల్లా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడంతో తుది జాబితాలను సిద్ధం చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. మరోవైపు గులాబీ కార్డుదారులకు, తెల్ల రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా రేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో శుక్రవారం అలాంటి వారికి రేషన్‌ సరకులు సరఫరా చేశారు. రేషన్‌ కార్డుదారులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

relief 20102018 3

తిత్లీ తుపానుకు 5 లక్షల కొబ్బరి చెట్లకు నష్టం జరిగినట్టు తెలుస్తోంది. యంత్రాంగం చేపట్టిన గణనలో కుప్పకూలిన కొబ్బరి చెట్ల సంఖ్య శుక్రవారం సాయంత్రానికి 4.5 లక్షలుగా ఉంది. మొత్తం గణన పూర్తయ్యే సరికి 5 లక్షలకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. జీడితోటలు 15,500 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. మరో 3 వేల హెక్టార్లకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. అరటి తోటలు 967 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. తోటలలో కూలిన చెట్లను తొలగించడానికి ఉపాధి హామీ పనులతో ముడిపెట్టారు. ఈ పథకం కింద చెట్లను తొలగించడానికి కొబ్బరి చెట్టుకు రూ.240 చొప్పున, జీడిమామిడి చెట్టుకు రూ.300 చొప్పున కూలి ధరలు నిర్ణయించారు. నష్టపరిహారాలలో తాటిచెట్లను కూడా చేర్చారు. తాటిచెట్టుకు రూ.800 పరిహారాన్ని ప్రకటించారు.వరకు విధుల్లో పాలుపంచుకుంటున్నామని ఒక తహసీల్దారుపై 10 మంది ఐఏఎస్‌లు, 10 మంది డిప్యూటీ కలెక్టర్ల సమీక్షలతో ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నామని తహసీల్దార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read