ఆరు రోజుల తరువాత, శ్రీకాకుళం వచ్చిన పవన్ కళ్యాణ్, కేవలం రాజకీయం చేస్తూ, మూడు రోజుల నుంచి, రోజుకి రెండు గంటల చొప్పున పర్యటన చేసి, ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. తుఫాను ప్రభావం ఏంటో కూడా తెలియకుండా, ఇప్పుడు అక్కడకి వచ్చి, ఇప్పటి వరకు కరెంటు ఎందుకు ఇవ్వలేదు ? ఆ యాప్ దేనికి ఉపయోగం అంటూ, పిచ్చి పిచ్చి ట్వీట్లు వేస్తూ, తన ఫాన్స్ ని రంజింప చేస్తున్నారు. ఇలాంటి నీఛ రాజకీయం చెయ్యటంలో జగన్ ని మించిపోయాడు పవన్. నిన్న ట్వీట్ చేస్తూ, తుఫాను బాధితుల కోసం ఒక 'యాప్' ఇచ్చి, దాంట్లో కష్టాలు చెప్పమంటున్నారు, అసలు ఈ యాప్ ఎందుకు, అంటూ, బుర్రలో గుజ్జులేని వాడిలా ఒక ట్వీట్ చేసారు. తెలిసి చేసాడో, తెలియక చేసాడో, తెలిసీ తెలియక చేసాడో కాని, మరోసారి పవన్ కు ఎంత పరిజ్ఞానం ఉందో అర్ధమవుతుంది.
అయితే వాస్తవంలో మాత్రం, తిత్లీ తుపాను బాధితులు సత్వర సాయం పొందేందుకు రూపొందించిన ‘పీపుల్ ఫస్ట్ సిటిజన్ యాప్’కు విశేష స్పందన లభిస్తోంది. బాధితులు నష్టానికి సంబంధించిన చిత్రాలు, పూర్తి వివరాలను ఈ యాప్‌కు పంపి సత్వర పరిహారం పొందవచ్చు. ఈ యాప్‌ను ఇంతవరకు 17వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఆర్టీజీఎస్ అధికారులు వెల్లడించారు. యాప్ ద్వారా అందిన సమాచారం ఆధారంగా ఆర్టీజీఎస్ తక్షణ చర్యలు తీసుకుంటోంది. యాప్‌కు సంబంధించి ఏమైనా సమస్యలుంటే 1100 కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. నష్టానికి సంబంధించిన మూడు ఫొటోలు, బాధితుని పూర్తి పేరు, చిరునామా, ఆధార్, మొబైల్ నంబర్‌తోపాటు జీపీఎస్ వివరాలు కూడా స్పష్టంగా పేర్కొంటే పరిహారం త్వరితగతిన అందే అవకాశం ఉంటుంది.
ఇప్పటి వరకు, ఈ యాప్ ద్వారా 4368 మంది సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ దృష్టిలో, వీళ్ళందరూ పిచ్చి వాళ్ళా ? ఎదో విమర్శ చెయ్యాలని చెయ్యటం, ప్రభుత్వాన్ని ప్రతిపక్షం విమర్శించటం, ఇవన్నీ చూస్తూనే ఉంటాం. కాని ఒక పక్క తుఫాను వచ్చి వారం అవ్వలేదు, ప్రభుత్వ ఉద్యోగులు ఫీల్డ్ లో అంత కష్టపడుతున్నారు. ఇవన్నీ వదిలేసి, ఆరు రోజులు తరువాత లార్డ్ లాగా వచ్చి, కరెంటు ఎందుకు ఇవ్వలేదు, ఈ యాప్ ఏంటి, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, తోలు తీస్తా, తొక్క తీస్తా, కాళ్ళు విరగ్గోడతా అంటూ గాల్లో పిడి గుద్దులు గుద్దితే, చివరకు ఏమి మిగులుద్దో ప్రత్యక్షంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి సమయాల్లో రాజకీయం చెయ్యకూడదు అనే కనీస పరిజ్ఞానం కూడా లేకుండా, పవన్ ప్రవరిస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, మనం చూసేదే ప్రపంచం అనుకోమాకండి పవన్ కళ్యాణ్ గారు.