తుపాన్ల సమయంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేలా సమర్థ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఇంధన శాఖ అధికారులు, విద్యుత్‌ సంస్థల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రకృతి విపత్తుల సమయాల్లో వేగంగా పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు అవసరమైన ప్రామాణిక నిర్వహణ ప్రక్రియ (ఎన్‌ఓపీ)ను ప్రత్యేకంగా రూపొందించాలని సూచించారు. విపత్తు నిరోధక వ్యవస్థను సృష్టించేందుకుగాను విద్యుత్‌ సంస్థలకు అవసరమైతే 10 నుండి 15 శాతం బడ్జెట్‌ను కేటాయించేందుకు వెనుకాడబోమన్నారు. ఇలాంటి వ్యవస్థ తుపాన్ల ప్రభావం ఎక్కువగా ఉండే కోస్తా, ఇతర జిల్లాల్లో బాగా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

titlei 04112018 2

తిత్లి తుపాను దెబ్బకు శ్రీకాకుళం జిల్లాలో చిన్నాభిన్నమైన విద్యుత్‌ వ్యవస్థను కేవలం 15 రోజుల్లోనే పునరుద్ధరించిన విద్యుత్‌ ఉద్యోగులు, సిబ్బందిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. 10 వేల మంది ఉద్యోగులు రేయింబవళ్లూ కష్టపడి యుద్ధప్రాతిపదికన తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారని ప్రశంసిం చారు. విద్యుత్‌ రంగం సత్తా చాటారన్నారు. తిత్లి, హుదూద్‌ తుపాన్ల్ల సమయంలో విద్యుత్‌ రంగానికి భారీ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. తిత్లి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రికార్డు సమయం లో విద్యుత్‌ సంస్థలు సరఫరాను పునరుద్ధరిం చిన ఉద్యోగులు, సిబ్బంది సేవల్ని మరువలే నన్నారు. ఇలాంటి సమయంలోనే విద్యుత్‌ సంస్థలు కొన్ని పాఠాలు నేర్వాలని, విపత్తు నిరోధక విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.

titlei 04112018 3

డిస్కంల స్థాయిలో విపత్తు నిర్వహణకు ప్రత్యేకంగా డైరెక్టర్‌ నేతృత్వంలో ఒక విభా గాన్ని ఏర్పాటు చేయాలని విద్యుత్‌ సంస్థలకు సూచించారు. విప త్తులు సంభవిం చినప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూడకండా తక్షణమే ఎన్‌ఓపీని (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌) అమలు చేసే బాధ్యత వారికి అప్పగించాలని చెప్పారు. తిత్లి నేపథ్యంలో సమగ్ర గ్రామీణ తుపాను మాన్యువల్‌ రూపొందించాలని చంద్రబాబు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. హుదూద్‌ తుపాను మాన్యువల్‌ను రివైజ్‌ చేయాలని సూచించారు. అధికారుల జీఐ సబ్‌ స్టేషన్లు, మొబైల్‌ సబ్‌ స్టేషన్లు, ఎమర్జెన్సీ రీస్టోరేషన్‌ టవర్లు వంటి వాటిని సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. తమ ప్రభుత్వం ఖర్చుకు వెనకాడబోదని, భూగర్భ కేబుల్‌ వ్యవస్థపైనా దృష్టి పెట్టాలని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read