సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చవిచూసింది. 3 లోక్‌సభ స్థానాలు, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా.. వీటిలో కేవలం ఒకే ఒక్క స్థానంలో మాత్రమే భాజపా విజయం సాధించింది. మిగతా నాలుగు చోట్ల అధికార కాంగ్రెస్‌-జేడీయూ కూటమి జయకేతనం ఎగురవేసింది. బళ్లారి, శివమొగ్గ, మాండ్య లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్‌ ఎంపీలు రాజీనామా చేయడం, రామనగర శాసనసభ స్థానాన్ని సీఎం కుమారస్వామి వదులుకోవడం, జమఖండీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మృతిచెందడటంతో ఈ స్థానాల్లో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి.

karnataka 06112018 2

దీంతో గత శనివారం ఉపఎన్నికలు నిర్వహించి, నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఫలితాల్లో కాంగ్రెస్‌-జేడీయూ కూటమి భారీ విజయం సాధించింది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి తాజా ఉపఎన్నికల్లో దక్కిన భారీ విజయం 2019 సార్వత్రిక ఎన్నికల సమీకరణాలను సమూలంగా మార్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో మోడీ-షా చేస్తున్న నిరంకుశ పనులు, వ్యవస్థల్ని నాశనం చెయ్యటం చూసి, చంద్రబాబు ముందుకొచ్చి, అన్ని పార్టీలను ఏకం చేస్తున్నారు. అయితే కొంత మందికి ఈ కూటమి సక్సెస్ పై అనుమానాలు ఉన్న టైంలో, కర్ణాటక ఉప ఎన్నికల తీర్పు, సరైన మెసేజ్ ఇచ్చింది. అన్ని పార్టీలు కలిస్తే, మోడీ-షా లను ఈ దేశం నుంచి తరమి తరిమి కొట్టచ్చు అనే సందేశం ఇచ్చింది.

karnataka 06112018 3

కాంగ్రెస్-జేడీఎస్ కూటమి కర్ణాటకలో, ‘‘కమల’’నాధులకు చుక్కలు చూపించడం...అటు జాతీయ రాజకీయాల్లో, ఇటు కర్ణాటక రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టించింది. బళ్లారి లోక్‌సభ, జమఖండి అసెంబ్లీ స్థానాల్లో పార్టీ ఓటమి కంటే.. అక్కడ కాంగ్రెస్‌కు దక్కిన భారీ మెజారిటీనే బీజేపీని మరింత షాక్‌కు గురిచేసింది. ఈ రెండు స్థానాల్లో ఏదో ఒకచోటైనా విజయం సాధిస్తామని బీజేపీ కౌంటింగ్ చివరిదాకా ఎదురు చూసినా ఫలితం మారలేదు. ఇదే ఫార్ములాతో వెళ్తున్న చంద్రబాబుకు, దేశంలో మోడీ-షా కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు, ఈ ఫలితాలు స్పష్టమైన మెసేజ్ ఇచ్చాయి. మాయావతి, మమత, లాంటి వాళ్ళు కూడా, ఈ ఫలితాలు చూసి, స్పష్టమైన వైఖరితో, అందరూ కలిసి, రేపు ఎన్నికలకు వెళ్తే, ఇక మోడీ-షా లకు, ఘోర పరాభవం తప్పదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read