ఇది నిజంగా పాపం వైసీపీకి వింత పరిస్థితి. రాష్ట్రంలో పర్సనల్ డిపాజిట్ (పీడీ) అకౌంట్లలో భారీ అవినీతి జరిగిందనేది బీజేపీ నేతల ఆరోపణ. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఇదే అంశం పై ఆ మధ్య జీవీఎల్ వంటి నేతలు ఒంటికాలిపై లేచారు. కాగ్ ప్రస్తావించిన అంశాల ఆధారంగా విమర్శలు చేశారు. కానీ పీడీ ఖాతాలపై కమలనాథులకు రాష్ట్ర ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) షాక్ ఇచ్చింది. ఈ ఖాతాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంపోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) లేవనెత్తిన అభ్యంత రాలను పద్దుల కమిటీ తోసిపుచ్చింది. అదీ పీఏసీ చైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన బుధ వారం రెండో రోజు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు.. రాష్ట్రంలో దాదాపు 53వేలకు పైగా ఉన్న పీడీ అకౌంట్లపై కాగ్ లేవనెత్తిన అభ్యం తరాల పై చర్చ జరిగింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఈ ఖాతాలను ఎందుకు తెరుస్తారో.. వాటివల్ల ప్రయోజనాలేమిటో.. వివిధ ప్రభుత్వాల హయాంలలో ఉన్న ఈ ఖాతాల గురించి కమిటీకి వివరించారు. దీంతో ఈ ఖాతాల పై కాగ్ లేవనెత్తిన అభ్యంతరాలను ఉపసంహరిస్తూ పదుల కమిటీ నిర్ణయం తీసుకుంది. పీఏసీ నిర్ణయంతో ఆర్థికశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఖాతాల పై జీవీఎల్ నరసింహారావు ఆడిన అబద్ధాలు అన్నీ ఇన్నీ కావు. 53 వేల కోట్ల స్కాం జరిగింది అంటూ, హడావిడి చేసాడు. ఇప్పుడు వైసీపీ ఆధ్వర్యంలోని కమిటీనే, ఇవి సక్రమం అని తేల్చింది.
ఇది ఒక్కటే కాదు, పెన్నా డెల్టా, తుంగ భద్ర ప్రాజెక్టు లో లెవెల్ కెనాల్ పనులు, 2012-13లో వరద కాలువ పనులు, హైదరాబాద్- శ్రీశైలం రోడ్డు నిర్మాణంలో ప్రణాళికా లేమి, 2012-13లో నిజాం సాగర్, గోదావరి డెల్లా సిస్టమ్ ఆధునీకరణ పనుల పై కాగ్ లేవనెత్తిన అభ్యంతరాలను, తుంగభద్ర కాలువ పనులపై కాగ్ లేవనెత్తిన అంశాలనూ పద్దుల కమిటీ ఉపసంహరించింది. మొత్తానికి, పాపం వైసీపీకి వింత పరిస్థితి. ఒక పక్క, బీజేపీ మాటలు వినాలి, వాళ్ళు చేసే పనికిమాలిన ఆరోపణలను సమర్ధించాలి. మరో పక్క, రాష్ట్ర ప్రజా పద్దుల కమిటీలో ఉంటూ, రూల్స్ ఫాలో అవ్వాల్సిన పరిస్థితి. రూల్స్ ప్రకారం వెళ్ళాల్సిన తప్పని పరిస్థితి. రూల్స్ ప్రకారం, అన్నీ పర్ఫెక్ట్ గా ఉండటంతో, ఆరోపణలు చేసిన నోటితోనే, అన్నీ సక్రమం అని సర్టిఫై చేసారు. జీవీఎల్ చేసిన ఆరోపణలు అన్నీ తుస్సు అని తేల్చేసారు.