మోడీకి వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలి అని అందరూ అంటున్నారు, కాని ఎవరూ ముందుకు రావటం లేదు. దేశ వ్యాప్తంగా మోడీ పై ఉన్న వ్యతిరేకతను, జాతీయ స్థాయిలో, జాతీయ పార్టీలు ఉపయోగించుకోవటం లేదు. మోడీ లాంటి బలమైన శక్తిని, కలిసి డీ కొట్టాలి అనే ఆలోచన మరిచి, ఎవరికీ వారే అన్నట్టు ఉన్నారు. ఇదే అవకాసంగా అమిత్ షా తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి, వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికల్లో, బీజేపీ గట్టెక్కే ప్లాన్ వేసారు. ఇది గ్రహించిన చంద్రబాబు, నిన్న ఢిల్లీలో వేగంగా పావులు కదిపారు. మళ్ళీ అందరినీ ఏకం చేసే ప్రయత్నం చేసారు. ఇందులో మాయావతితో మీటింగ్ మాత్రం, ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ అయ్యింది. కాంగ్రెస్ తో కలిసి వెళ్ళేది లేదని, మాయావతి ప్రకటించిన తరువాత, అలా విడి విడిగా పోటీ చేస్తే, ఓట్లు చీలి, బీజేపీ సునాయాసంగా గెలిచి పోతుంది అంటే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.

cbn 28102018 2

నిన్న చంద్రబాబుతో కలిసిన తరువాత, దీనిపై పునరాలోచనకు సంసిద్ధత వ్యక్తం చేశారు మాయావతి. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు, సార్వత్రిక ఎన్నికల పరిస్థితిపై 45 నిమిషాలపాటు మాయవతితో చంద్రబాబు చర్చించారు. కాంగ్రెస్ తో పొత్తు తెంచుకుని... బీఎస్పీ విడిగా పోటీ చేస్తే బీజేపీకి భారీ రాజకీయ లబ్ధి చేకూరడం ఖాయం. కాంగ్రెస్ తో పొత్తు ఉండదని, ఒంటరిగా పోటీ చేస్తామని మాయావతి చెప్పగానే... బీజేపీ ఆనందంలో మునిగిపోయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఈ అంశాలపై చంద్రబాబు, మాయ మధ్య చర్చ జరిగింది. మాయ ఒంటరిపోరు వల్ల ఆ రాష్ట్రాల్లో బీజేపీకి ఎలా లబ్ధి జరుగుతుందో వివరిస్తూ వచ్చిన మీడియా కథనాలు, పోల్‌ సర్వేలు, ఇతర గణాంకాల ప్రస్తావన వచ్చింది. అయితే, కేవలం కాంగ్రెస్‌ స్థానిక నాయకత్వాలు బీఎస్పీ బలానికి తగినట్టు సీట్లు ఇవ్వలేదని, తమ ప్రాధాన్యాన్ని గుర్తించలేదని... అందుకే ఒంటరిగా పోటీకి దిగాల్సి పరిస్థితి వచ్చిందని మాయావతి చెప్పారు. తగిన ప్రాధాన్యం ఇస్తే కాంగ్రెస్తో చేతులు కలిపేందుకు సిద్ధమని పరోక్ష సంకేతాలు ఇచ్చారు.

cbn 28102018 3

దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీయేతర ప్రతిపక్షాలను కూడగట్టే దిశగా చంద్రబాబు చకచకా అడుగులు వేశారు. తన ఒక రోజు పర్యటనలోనే మాయావతి (బీఎస్పీ), ఫరూక్‌ అబ్దుల్లా (ఎన్సీపీ), కేజ్రీవాల్‌ (ఆప్‌), శరద్‌ యాదవ్‌ (జనతాదళ్‌ యు బహిష్కృత నేత) నేతలతో చర్చలు జరిపారు. దేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్రమోదీ తిరిగి అధికారంలోకి రాకుండా చూడాలని, అందుకు అందరం కలిసి పనిచేద్దామని చంద్రబాబు వద్ద నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా సూచించారు. మోదీ అన్ని వ్యవస్థల్ని కుప్పకూల్చారన్నారు. ‘‘దేశం ప్రమాదంలో పడింది. భిన్నత్వంలో ఏకత్వం మన సంస్కృతి. ఇప్పుడు అది ముప్పులో పడింది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పేదలు మరింత పేదలవుతున్నారు. ఈ పరిస్థితుల్లో భారత దేశాన్ని కాపాడేందుకు సీనియర్లు కలిసి కట్టుగా కృషి చేయాలి’’ అని చంద్రబాబుతో భేటీ అనంతరం ఫరూక్‌ అబ్దుల్లా విలేకరులకు చెప్పారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదని... ప్రమాదంలో ఉన్న దేశాన్ని కాపాడేందుకు అందరూ తమతమ పాత్ర పోషించాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read