ఆపరేషన్ గరుడ... ఈ ప్లాన్ మొట్టమొదట బయట పెట్టింది, సినీ హీరో శివాజీ.. అన్నీ కాకపోయినా, ఆయన చెప్పిన దాంట్లో, 90 శాతం నిజం అయింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మీద దాడి మినహా, శివాజీ చెప్పిన ప్రతి పాయింట్ నిజం అయింది. గవర్నర్ జోక్యం చేసుకోవటం, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి ఎదురు తిరగటం, కులాల మధ్య గొడవలకి ప్లాన్ చెయ్యటం, చంద్రబాబుకు నోటీసులు, తెలుగుదేశం నాయకుల పై ఐటి దాడులు, జగన్ పై అటాక్, ఇవన్నీ గత నాలుగు నెలలుగా చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు, ఢిల్లీ పై యుద్ధం మొదులు పెట్టిన దగ్గర నుంచి, అన్ని వైపుల నుంచి, చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో, బీజేపీ, జనసేన, జగన్, కెసిఆర్ కుమ్మక్కు కళ్ళారా చూస్తున్నాం.
అయితే జగన్ పై దాడి తరువాత, శివాజీ చెప్పినవన్నీ జరుగుతున్నాయి అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే శివాజీ పై ఎదురు దాడి చేస్తున్నారు వైసీపీ పార్టీ నేతలు, బీజేపీ నేతలు. దీంతో శివాజీ వారి పై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా, వైసీపీ ఎమ్మెల్యే రోజా పై, జీవీఎల్ పై శివాజీ మండిపడ్డారు. తనపై రోజా ఉపయోగించిన భాష చాలా దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే ఆమెపై పరువు నష్టం దావా కూడా వేయగలనని... కానీ, ఇప్పటికీ ఆమెను గౌరవిస్తున్నానని అన్నారు. తాను మాట్లాడాలనుకుంటే... రోజా కంటే నీచమైన భాషలో మాట్లాడగలనని చెప్పారు. తాను పల్నాడు ప్రాంతానికి చెందినవాడినని... బూతుల్లో పీహెచ్డీ ఏదైనా ఉంటే అది మా పల్నాడులోనే ఉంటుందని చెప్పారు. 'రోజమ్మా... దయచేసి నా జోలికి రావద్దు. నా వ్యక్తిగత జీవితం గురించి విమర్శిస్తే... కచ్చితంగా పరువు నష్టం నోటీసులు పంపిస్తా' అని హెచ్చరించారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు.
రాష్ట్రంలో జగబోతున్న భయంకర పరిణామాల గురించే తాను 'ఆపరేషన్ గరుడ'కు సంబంధించిన వీడియోను విడుదల చేశానని శివాజీ అన్నారు. అందులో తాను బీజేపీ, వైసీపీ, జనసేనల పేర్లను కూడా ఉచ్ఛరించలేదని చెప్పారు. తన వీడియోను చూసి ఈ పార్టీల నేతలంతా... ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో అర్థం కావడం లేదని అన్నారు. తనను విచారించి మొత్తం సమాచారాన్ని లాగాలని వైసీపీ, బీజేపీ నేతలు అంటున్నారని... 20 నిమిషాలకు పైనున్న తన వీడియోలో తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పానని... ఇంకా ఏమి కావాలని ప్రశ్నించారు. విచారణ సంస్థలన్నీ కేంద్రం పరిధలోనే ఉన్నాయని, తనపై విచారణ జరుపుకోవచ్చని అన్నారు. తనను అరెస్ట్ చేసినా అభ్యంతరం లేదని తెలిపారు. ఒక వేళ తనను అరెస్ట్ చేస్తే... మూడు నెలల్లోగా చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేస్తాము, చంద్రబాబు అంతు తేలుస్తాం, చుక్కలు చూపిస్తాం అంటున్న జీవీఎల్ ను కూడా కస్టడీలోకి తీసుకోవాలని అన్నారు. ఏ కుట్ర పన్నారో, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎలా పడేస్తామని అంటున్నారో, పోలీసులు నాతో పాటు, ఆయన్ను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యాలని అన్నారు.