ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిస్థుతులు, మోడీ-షా వ్యవస్థలను నాశనం చెయ్యటంతో, వీళ్ళ నుంచి దేశాన్ని ఎలా రక్షించుకోవాలనే అంశంపైనే తాను చంద్రబాబుతో చర్చించానని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. శనివారం సాయంత్రం ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఢిల్లీలో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశం ముఖ్యం, దేశ భిన్నత్వాన్నికాపాడుకోవడం ముఖ్యమన్నారు. అన్ని పక్షాలను కలుపుకొని ముందుకెళ్తామని, ఐకమత్యం సాధిస్తామని వెల్లడించారు. ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థి ఎవరనేది అవసరం లేదని.. గెలిచిన తర్వాత ప్రధాని అభ్యర్థిపై నిర్ణయించుకోవచ్చని తెలిపారు.

farook 27102018 2

రాహుల్‌ తానేమీ కూటమి నాయకుడిగా లేదా ప్రధాని అభ్యర్థిగా చెప్పలేదు కదా? అని మీడియాతో అన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. ఏపీకి సాయం చేయడంలో కేంద్రం మొండిచేయి చూపడం, విభజన చట్టం పెండింగ్‌ అంశాలతో పాటు దేశంలోని రాజకీయ పరిణామాలు, తెదేపా లక్ష్యంగా జరుగుతున్న ఐటీ దాడులను దిల్లీ వేదికగా ప్రజలకు వివరించడమే లక్ష్యంగా చంద్రబాబు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ మధ్యాహ్నం దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ పాలనా వైఫల్యాలతో పాటు ఏపీ పట్ల కేంద్రం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు.

farook 27102018 3

రేపుమాపో తనపై కూడా దాడులు జరుగుతాయని తెలుసని సీఎం చంద్రబాబు వెల్లడించారు. 40 ఏళ్లుగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నానని, ఏనాడూ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. టీడీపీ నేతల వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహించారని, బీజేపీని వ్యతిరేకించే రాజకీయ పార్టీల నేతలను కేసుల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డిసహా అనేక రాష్ట్రాల్లో ఇదే జరుగుతోందని చెప్పారు. ‘‘మేం బీజేపీతో స్నేహం చేసినన్ని రోజులు... మాకు పన్ను ఎగవేత నోటీసులు రాలేదు. బీజేపీతో విడిపోగానే 19బృందాలతో ఐటీ దాడులు చేయించారు. విభజన చట్టం అమలుపై విబేధించినంత మాత్రాన వేధిస్తారా? దేశంలో లౌకికవాదానికి ప్రమాదం వాటిల్లుతోంది. ప్రధాని, అధికార పార్టీ అధ్యక్షుడు ఒకే రాష్ట్రం వారు ఉండకూడదు. కేంద్రంలోని కీలక పదవుల్లో మొత్తం గుజరాతీలే ఉన్నారు. తమకు నచ్చనివాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు’’ అని చంద్రబాబు మండిపడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read