తెలుగు ప్రజలను అవమానిస్తే, అణచివేయాలని చూస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో.. 80వ దశకంలో నందమూరి తారక రామారావు నిరూపించారు. జాతీయ రాజకీయాలను శాసించగల దమ్ము తెలుగోడికి ఉందని చాటిచెప్పారు. ఆ తర్వాత 90వ దశకంలో మరోసారి చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం సత్తాఏంటో చూపించింది. తాజాగా బుధవారం ఢిల్లికి చేరుకున్న చంద్రబాబు ఫ్రంట్‌ కార్యాచరణను ప్రారంభించారు. ఎడముఖం పెడముఖంగా ఉంటున్న బీజేపీయేతర పార్టీల నేతలతో వరుస భేటీలు జరిపారు. దేశ రాజకీయాల్లో ఉద్ధండులైన శరద్‌పవార్‌, ఫరూఖ్‌ అబ్దుల్లా, అఖిలేష్‌, ఏచూరి, మాయావతి, మమతాబెనర్జీలతో ప్రత్యేకంగా చర్చించారు. గురువారం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలుసుకున్నారు. దేశాన్ని రక్షించుకుందాం.. కలిసి రండి అంటూ విపక్ష పార్టీలకు పిలుపునిచ్చి కాషాయపార్టీలో చంద్రబాబు ప్రకంపనలు సృష్టించారు.

ccbn 02112018 2

మొదటి నుంచి సైద్ధాంతిక విభేదాలతో ఉప్పు, నిప్పుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలు చేతులు కలిపి... దేశ రాజకీయాల్లో సరికొత్త మార్పుకు నాంది పలికాయి. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విభేదాలను పక్కన పెట్టాయి. ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు... రాహుల్ గాంధీ, శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, సీతారాం ఏచూరి, ఫరుక్ అబ్దుల్లా, తదితర నేతలతో కలసి సరికొత్త రాజకీయ సమీకరణకు తెర లేపారు. ఈ నేపథ్యంలో, అన్ని పార్టీలు కలసి బీజేపీని ఎదుర్కోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మహాకూటమిలో 15 పార్టీలు ఉండనున్నాయి. అవేమిటంటే... కాంగ్రెస్, టీడీపీ, ఎన్సీపీ, ఆర్జేడీ, బీఎస్పీ, ఎస్పీ, జేఎంఎం, సీపీఎం, సీపీఐ, జేడీఎస్, తృణమూల్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, డీఎంకే, లోక్ దళ్. ఈ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెస్తూ, జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటయింది. సేవ్ ది నేషన్.. సేవ్ డెమోక్రసీ.. పేరుతో కూటమి రూపుదిద్దుకుంటోంది.

ccbn 02112018 3

దేశాన్ని గట్టెక్కించాలన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకోవాలన్నా బీజేపీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలన్నీ ఒకే గొడుగు కిందకు చేరాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గతంలో బీజేపీకి, కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిన ప్రత్యామ్నాయ కూటములేవీ సఫలం కాలేకపోయాయని, వికటించిన ఆ ప్రయోగాల నుంచి నేర్చుకున్న అనుభవంతోనే కూటమికి ఏర్పాటు కోసం చొరవ చూపుతున్నానని చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో తాను ఇప్పటికే శరద్‌ యాదవ్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, ఫరూఖ్‌ అబ్దుల్లా, మాయావతి వంటి నేతలను గత శనివారం ఢిల్లికి వచ్చినప్పుడు కలిశానని, గురువారం నాటి రెండవ పర్యటనలో శరద్‌ పవార్‌, రాహుల్‌ గాంధీతోపాటు అజిత్‌ జోగి, అరుణ్‌ శౌరిని కలిశానని ములాయం సింగ్‌ యాదవ్‌, కుమారస్వామి, మమతా బెనర్జీ సహా పలువురితో సంప్రదింపులు చేస్తున్నానని తెలిపారు. బీజేపీని ఓడించడం కోసం అందరినీ ఏకతాటికి మీదికి తీసుకొచ్చేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ఈ కూటమికి నేతలెవరూ లేరని, అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తామని తెలిపారు. తొలుత అందరం కలిసి కూర్చుని మాట్లాడు కుంటామని, ఆ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటామని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read