ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు జాతీయ పార్టీల నేతలతో వరుస భేటీలతో బిజీబిజీగా గడిపిన సంగతి తెలిసిందే. మోడీకి వ్యతిరేకంగా కూటమి కట్టి, మోడీ-షా చేస్తున్న ఘోరాలకు అడ్డుకట్టే వేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పై కూడా, మోడీని కార్నెర్ చేసే ప్రయత్నం చేసారు. అయితే ఈ విషయం పై, శుక్రవారం జన్మభూమి ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ కాంగ్రెస్-టీడీపీ కలయికపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన బాస్ మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు అడుగులు వేస్తుంటే, పాపం పవన్ తట్టుకోలేక పోతున్నారు.
పవన్ మాట్లాడుతూ, " సినిమా రిలీజ్ ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తారు. కాంగ్రెస్ టీడీపీ కలయిక కూడా ప్రీరిలీజ్ ఫంక్షన్ లాగే ఉంది. చివరకు చంద్రబాబు ఎక్కడ మొదలయ్యారో అక్కడికే వెళ్లారు. చంద్రబాబు నిన్న ట్రైలర్ వదిలారు, కాని సినిమా ఫ్లాప్ అవుతుందని అన్నారు. మా అన్న చిరంజీవి కాంగ్రెస్లో ఉన్నప్పటికీ నేను రాష్ట్రం కోసం మీకు మద్దతు ఇస్తే మీరు వెళ్లి అదే కాంగ్రెస్తో కలవడం ఎంతవరకు సమంజసం?" అని ఈ సందర్భంగా టీడీపీకి పవన్ సూటి ప్రశ్న సంధించారు. ప్రజాసమస్యలను తెలుసుకోవడానికే తాను యాత్రలు చేస్తున్నానని... అధికారం కోసం కాదని చెప్పారు. కాని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని అన్నారు.
మొత్తానికి, ఆంధ్రప్రదేశ్ కు విభజన హామీలు నెరవేర్చకుండా, ఆంధ్రులని తొక్కి పడేస్తున్న మోడీ పై, చంద్రబాబు తిరగబడి, వీరోచితంగా పోరాడుతుంటే, పాపం పవన్ కళ్యాణ్ మాత్రం తట్టుకోలేక పోతున్నారు. చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నంత వరకు, చంద్రబాబుకి మోడీని అడిగే దమ్ము లేదన్నాడు పవన్. తరువాత మోడీని బాబు చాకిరేవు పెడుతుంటే, అలా ఎందుకు అంటున్నాడు. అవిశ్వాసం టైంలో కూడా అలాగే చేసాడు. చివరకు ఏమైపోయాడో తెలియకుండా, ఒక నెల రోజులు బయటకు రాలేదు. ఇప్పుడు దేశం మొత్తం మోడీకి వ్యతిరేకం అయితే, దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు, ఏకం అవుతుంటే, పాపం పవన్, జగన్, కెసిఆర్ మాత్రం తెగ బాధ పడుతున్నారు. ఎంతైనా మోడీ, వీళ్ళ బాస్ కదా, ఆ మాత్రం విశ్వాసం ఉండటం సహజం...