తెలుగు ప్రజలందరికీ నమస్కారములు... మోడీ నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడుకుందాం..

మోడీ నియంతృత్వ విధానాల వల్ల నేడు దేశం విపత్కర పరిస్తితులను ఎదుర్కొంటోంది. ప్రజాస్వామ్య వ్యవస్థ కూనీ అవుతోంది. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటున్నది. వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. డీమానిటైజేషన్‌ వల్ల రెండు కోట్ల మందికి ఉపాధి ఉద్యోగాలు కోల్పోయారు. సెక్యులరిజం ప్రమాదంలో పడింది. రాష్ట్రాల హక్కులన్నీ కేంద్రం హరిస్తోంది. విభజన చట్టంలోని 18 అంశాలను అమలు చేయలేదు. ప్రత్యేక హోదాను నిరాకరించింది. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాలకు ఇచ్చిన రూ.350కోట్ల నిధులను వెనక్కి తీసుకున్నారు. ఈ రకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రాలను అణగదొక్కుతూ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నది.

తెలుగువారి హక్కుల పరిరక్షణ కోసం, దేశ రక్షణ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, సెక్యులర్‌ వ్యవస్థ సంరక్షణకోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నడుంబిగించారు. రెండు దఫాలు ఢిల్లీకి వెళ్లి మోడీ నియంతృత్వాన్ని వ్యతిరేకించే జాతీయ, ప్రాంతాయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నానికి దేశ వ్యాప్తంగా వస్తున్న స్పందనతో తెలుగువారి ప్రతిష్ట దేశ వ్యాప్తంగా మరింత పెరిగింది. వైఎస్‌ఆర్‌ పార్టీ, జనసేన మోడీ నియంతృత్వాన్ని వ్యతిరేకించకపోగా.. ఆ రెండు పార్టీలు తెలుగుదేశంపై చేస్తున్న దాడి మోడీ నియంతృత్వానికి వంతపాడటం కాదా.?

1. సేవ్‌ నేషన్‌, సేవ్‌ డెమోక్రసీ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని తెలుగు ప్రజలతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించారు. 2. మోడీ నిరంకుశత్వ విధానాలకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాన్ని దేశంలోని ప్రధాన పక్షాలన్నీ స్వాగతిస్తుంటే.. వైసీపీ, జనసేన ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి. మోడీతో వారి లాలూచీకి ఇది తాజా నిదర్శనం కాదా.? ఈ పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు పట్టవా.? కేవలం వారి పార్టీ ప్రయోజనాలు, సొంత ప్రయోజనాలే ముఖ్యమా.? 3. తెలుగుదేశం పార్టీ ఏదో ఒక పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాదు. పార్టీలకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీలు, స్వలాభం కోసం పుట్టిన పార్టీలు, పుఘలో పుట్టి మఘలో మాయమయ్యాయి. విధానాలు, ప్రజా ప్రయోజనాల కోసం పుట్టిన పార్టీలు మాత్రమే సుధీర్ఘకాలం మనగలిగాయి. తెలుగుదేశంపై ఎన్నో దాడులు చేసినప్పటికీ గత 36ఏళ్ల నుంచి దినదినాభివృద్ధి చెందుతోందంటే కారణం.. తెలుగుదేశం విధానాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం పుట్టిందని రుజువవుతోంది.

4. తెలుగుదేశం.. తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి సమగ్రాభివృద్ధి కోసం, కేంద్రం యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ. నాడు తెలుగువారిని కేంద్ర ప్రభుత్వం వీపుమీద కొడితే.. నేడు మోడీ ప్రభుత్వం తెలుగువారి కడుపు కొడుతున్నది. 5. స్వర్గీయ ఎన్టీరామారావు గారి విధానాలను నేడు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ.. మోడీ నియంతృత్వంపై పోరాడుతున్నారు. 6. కాంగ్రెస్‌తో కలిసి ఉద్యమించటాన్ని.. ఎన్టీఆర్‌ ఆత్మక్షోభిస్తోందని బీజేపీ, వైసీపీ, జనసేన నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్‌లో అవినీతి చక్రవర్తి అయిన కన్నా లక్ష్మీనారాయణను అధ్యక్షుడిగా పెట్టుకున్న బీజేపీ.. తెలుగుదేశానికి నీతి బోధ చేయటం హాస్యాస్పదం. ఎన్టీఆర్‌ను హింసించి అవమాన పరిచిన వైఎస్‌ కుమారుడి పార్టీలో లక్ష్మీపార్వతి చేరడం వల్ల ఎన్టీఆర్‌ ఆత్మక్షోభిస్తోంది. 7. పురందేశ్వరిగారు కాంగ్రెస్‌ పార్టీలో చేరినపుడు ఎన్టీఆర్‌ ఆత్మక్షోభించలేదా.? కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్న పురందేశ్వరిని బీజేపీలో చేర్చుకున్నపుడు ఎన్టీఆర్‌ ఆత్మగుర్తుకు రాలేదా.?

8. దేశరక్షణ వ్యవస్థతో సహా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సీబీఐ లాంటి వ్యవస్థలను భ్రష్టుపట్టించారు. న్యాయవ్యవస్థల్లోను రాజకీయ జోక్యం చేసుకున్నారు. మీడియాపై అజమాయిషీ చేస్తున్నారు. బీజేపీని వ్యతిరేకించిన రాజకీయ పక్షాలు, ప్రజాప్రతినిధులపై ఐటీ దాడులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. 9. ఏకపక్షంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని క్యాబినేట్‌ మంత్రులే మనీ లాండరింగ్‌ అన్నారు. డిమానిటైజేషన్‌తో వందలాది మంది ప్రాణాలను బలిగొన్నారు. అస్తవ్యస్థమైన జీయస్‌టీతో వేలాది కంపెనీలు మూతబడి లక్షలాది యువత ఉపాధికి గండి కొట్టారు. 10. కర్నాటక ఎన్నికల్లో గవర్నర్‌ వ్యవస్థను దుర్వినియోగం చేశారు. ఢిల్లీలో గవర్నర్‌ జనరల్‌ వ్యవస్థను దుర్వినియోగం చేసిన తీరును కోర్టు తప్పుపట్టింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో చూశాం.

11. సమాఖ్య స్పూర్తికి తూట్లు పొడుస్తూ రాష్ట్రాల్లో అవినీతి లొసుగులున్న నాయకులతో అనైతిక పొత్తు పెట్టుకొని రాజకీయంగా లబ్దిపొందేందుకు బీజేపీ వెంపర్లాడుతుంది. 12. కేంద్రంలోని బీజేపీకి న్యాయస్థానాలంటే లెక్కలేదు. ఎన్నికల కమిషన్‌ అంటే గౌరవం లేదు. అవినీతిని పెంచి పోషిస్తున్నారు. 13. విదేశాల్లో దాకున్న ధనాన్ని తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని అన్నారు. ఆ పని చేయకపోగా.. బ్యాంకులకు టోకరా పెట్టిన వ్యక్తులకు అండగా నిలిచి విదేశాలకు పంపిస్తున్నారు. 14. రాఫెల్‌ డీల్‌లో కుంభకోణం జరిగిందని బీజేపీ నాయకులే చెప్పారు. పేదవారికి అండగా నిలవాల్సిన బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ వ్యవస్థలను పెంచి పోషిస్తోంది. 15. బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రస్తుతానికి 15 పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని గాడిలో పెట్టే బాధ్యతను చంద్రబాబు నాయుడు తీసుకోవటాన్ని దేశ ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు.

మోదీ చెప్పిన అచ్చేదిన్‌ బీజేపీ నాయకులకు, బ్యాంకుల నుంచి వేల కోట్లు దోచుకుని పారిపోయిన అవినీతి పరులకు తప్ప ప్రజలకు రాలేదు. దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను ఒకే తాటిపైకి తీసుకువస్తున్నారు. మోడీ పాలనకు చరమగీతం పాడి దేశాన్ని రక్షించుకుందాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. లౌకిక వ్యవస్థను నిలబెట్టుకుందాం. రాజ్యాంగ వ్యవస్థలను రక్షించుకుందాం. దిగజారిపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థను, వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read