జగన్ పై కోడి కత్తి దాడి తరువాత, దాడి చేసిన వ్యక్తి శ్రీనివాసరావు, పెద్ద వైసీపీ అభిమాని అని అందరికీ తెలిసిన విషయమే. అయితే, అతన్ని తెలుగుదేశం పార్టీకి అంటకట్టటానికి, లోటస్ పాండ్ లో ఉన్న మార్ఫింగ్ బ్యాచ్, తెలుగుదేశం సభ్యత్వ కార్డుతో, అతని పేరు మీద ఒక సభ్యత్వ కార్డు తాయారు చేసి వదిలింది. అయితే, ఆ కార్డ్ నెంబర్ ద్వారా అసలైన వ్యక్తి మీడియా ముందుకు వచ్చి, ఈ గొడవలోకి నన్ను ఎందుకు లాగారు అంటూ బాధపడ్డారు. ‘‘చిన్ననాటి నుంచి నేను ఎన్టీఆర్ అభిమానిని. సినిమాల నుంచి రాజకీయాలలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఎన్టీఆర్ అభిమానిగానే కొనసాగుతున్నా. ఓటు పుట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకే వేస్తూ వీరాభిమానిగా ఉన్నా. రెక్కాడితే గాని డొక్కాడని గిరిజన కుటుంబానికి చెందినవాడిని. నా కార్డును ఫోర్జరీ చేసి ఈ విధంగా అలజడి సృష్టించటం దారుణం’’ అంటూ నంబూరి అంకాలు కన్నీటి పర్యంతమయ్యాడు.
గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలంలోని గణపవరం గ్రామానికి చెందిన అంకాలు నిరుపేద గిరిజన కూలి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కార్డు వ్యవహారంలో నిజానిజాలను వివరించటానికి టీడీపీ శ్రేణులు అంకాలును మీడియా ముందకు తీసుకొచ్చాయి. ఈ సందర్భంగా అంకాలు మాట్లాడుతూ, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై హత్యాయత్నం చేసిన వ్యక్తి పేరుతో నా టీడీపీ సభ్యత్వపు కార్డును ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకోలి’’ అని డిమాండ్ చేశాడు. సుబ్బరాజు పేరుతో బయటకొచ్చిన 05623209 నంబరును కార్డును వాస్తవంగా ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గానికి చెందిన మొలకలపల్లి వెంకటరమణమ్మకు టీడీపీ జారీ చేసింది. అదేవిధంగా శ్రీనివాసరావు పేరుతో ఉన్న 056232210 నంబరు కార్డును బాపట్ల నియోజకవర్గ పరిధిలోని కర్లపాలెం మండలం గణపవరానికి చెందిన అంకాలు నంబూరికి కేటాయించారు.
ఈ ఒరిజినల్ కార్డులు తీసుకొని వెంకటరమణమ్మ ఫొటో స్థానంలో సుబ్బరాజు ఫొటోను, నంబూరి అంకాలు స్థానంలో శ్రీనివాసరావు ఫొటోను ఉంచి తప్పుడు టీడీపీ సభ్యత్వ కార్డులను సృష్టించారు. మరో పక్క, ఈ ఆధారాలతో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య.. గుంటూరులో టీడీపీ రాష్ట్ర కార్యాలయం పరిధిలో ఉన్న అరండల్పేట పోలీ్సస్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. కుట్ర, మోసం, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడం, మార్ఫింగ్ చేసి తప్పుడు కార్డుల సరైనవేనని చూపించడం, ఆధారాలు తారుమారు చేయడం, ప్రజాశాంతికి విఘాతం కలిగించడం తదితర అభియోగాలను ఫిర్యాదులో ప్రస్తావించారు. వీటి ప్రకారం ఈ నకిలీ కార్డుల అంశం పై ఐపీసీలోని 120 (బి), 420, 468, 469, 471, 201, 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెస్ట్ డీఎస్పీ సౌమ్యలత తెలిపారు.