ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, అంటే ఈ రాష్ట్రంలో తెలీనివారు ఉండరు... ఈ రాష్ట్రంలో ఉన్న అతి కొద్ది మంది సీనియర్ నాయకుల్లో ఒకరు... శాసనసభాపతిగా, ఇటు నియోజకవర్గ ఎమ్మల్యేగా, రెండు పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు... ఇవాళ చేసిన మంచి పని, మరోసారి ఆయన ప్రజా నాయకుడు అని ప్రూవ్ చేసింది... ఇవాళ డాక్టర్ గా కూడా, తన వృత్తి ధర్మం నెరవేర్చారు.. ప్రజా నాయకుడిగా కూడా పని చేసి, ఒక జీవితాన్ని కాపాడారు... అనేకసార్లు ఆయాన వెళ్ళే దారిలో ప్రమాదాలు జరిగితే, స్వయంగా వారికి ఫస్ట్ ఎయిడ్ చేసి, తానే హాస్పిటల్ లో జాయిన్ చేసే వారు. ఈ సారి కూడా అలాంటి సంఘటనే జరిగింది.
మరోసారి మానవత్వం చాటుకున్న ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు. గుంటూరు జిల్లా నరసరావుపేట రూరల్ మండలంలోని ఇస్సపాలెం సమీపంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో నాలుగు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెల కాపరి వేముల శ్రీను రోడ్డు పై అపస్మారక స్థితిలో పడిపోయాడు. పమిడిపాడులో కార్యక్రమం ముగించుకొని నరసరావుపేటకు వస్తున్న స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు సంఘటనను చూసి వెంటనే వాహనాన్ని ఆపి గొర్రెల కాపరిని చూసి వ్యక్తిగత సిబ్బంది వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
కోడెల కూడా స్వయంగా వారితో పాటు హాస్పిటల్ కు వెళ్లారు. వేముల శ్రీనుకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. సంఘటన ఎలా జరిగిందో మిగతా గొర్రెల కాపరులను అడిగి తెలుసుకున్నారు. వేముల శ్రీను నకరికల్లు మండలం రూ పెనగుంట్లకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఢీకొట్టిన వాహనాన్ని గుర్తించాలని స్పీకర్ డాక్టర్ కోడెల పోలీసులను ఆదేశించారు. సంఘటనా స్థలంలో వివరాలను తహసీల్దార్ బీ వెంకటేశ్వరరావు సేకరించారు. మరో పక్క, కొంచెం సేపటి తరువాత పరిస్థితి విషమంగా ఉందని తెలియటంతో, మోరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించాలని వైద్యులను స్పీకర్ ఆదేశించారు.