తిత్లీ తుపాన్ తాకిడితో శ్రీకాకుళం జిల్లా  అత‌లాకుల‌మైంది. ప్ర‌జ‌లు తుపాన్ దెబ్బ‌కు తీవ్రంగా న‌ష్ట‌పోయి పుట్టెడు క‌ష్టాల్లో ఉన్నారు . ప్ర‌భుత్వ యంత్రాంగం అహోరాత్ర‌లు క‌ష్ట‌ప‌డి బాధితుల క‌ష్టాలు తీర్చే ప‌నుల్లో నిమ‌గ్న‌మైంది. ప్ర‌భుత్వ అధికారులు, సిబ్బంది రేయింబ‌వ‌ళ్లు నిద్రాహారాలు మాని స‌హాయ‌క‌చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. ఈ ప‌రిస్థితుల్లో ఎవ‌రైనా త‌మ‌కు తోచిన రీతిలో బాధితుల‌కు ఆప‌న్న హ‌స్తం అందించాలి. ఈ క‌ష్ట‌స‌మ‌యంలో మేమంతా మీకు తోడుగా ఉన్నామ‌న్న భ‌రోసా క‌ల్పించాలి. దురుదృష్ట‌వ‌శాత్తూ రాష్ట్రంలో కొన్ని శ‌క్తులు బాధితులను ఆదుకోక‌పోగా, వారి క‌ష్టాలు, క‌న్న‌ళ్ల‌ను రాజ‌కీయం చేస్తున్నాయి. బాధిత‌ల‌ను రెచ్చ‌గొట్టి స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం క‌లిగించి వికృత పోక‌డ‌ల‌కు పాల్ప‌డుతున్నాయి . క్షేత్ర‌స్థాయిలో ప్ర‌భుత్వ యంత్రాంగం ఎంతో క‌ష్ట‌ప‌డి బాధితుల‌కు అన్ని ర‌కాల స‌హాయ స‌హ‌కారాలు దిస్తోంది. అది చూసి ఓర్వ‌లేని శ‌క్తులు అక్క‌డ స్థానికంగా ఉన్న బాధితుల‌ను రెచ్చ‌గొడుతున్నారు. అక్క‌డ స‌హాయ‌క చ‌ర్య‌లు సాఫీగా జ‌ర‌గ‌కుండా అడ్డుకునేలా ప్రేరేపిస్తున్నారు. తిత్లీ తీరం దాటిన మ‌రుస‌టి రోజు నుంచి ఒక ప‌థకం ప్ర‌కారం ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు..

lokeshletter 17102018 2

ఉదాహ‌ర‌ణ‌ల‌కు కొన్ని... 13.10.2018.. తిత్లీ తుపాన్ సంభ‌వించిన వెంట‌నే మంత్రులు ఆయా ప్రాంతాల్లో బాధితుల క‌ష్టాలు తెలుసుకుని వారికి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డానికి వెళ్లారు. వ‌జ్ర‌పుకొత్తూరుకు ఇలా వెళ్లిన మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడుని వాహానాన్ని అడ్డుకునేలా అక్క‌డ స్థానిక రాజ‌కీయ శ‌క్తులు ప్రేరేపించాయి. 13.10.2018.. క‌విటి మండ‌లం జ‌గ‌తి గ్రామంలో కూడా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కాన్వాయ్‌ను అడ్డుకునేలా అక్క‌డ స్థానిక రాజ‌కీయ నేత‌లు పుర‌మాయించారు. నిజానికి అక్క‌డ వారి స‌మ‌స్య‌లు తెలుసుకుని వారికి స‌హాయ‌క‌చ‌ర్య‌లు ఎలా జ‌రుగుతున్నాయో తెలుసుకోవ‌డానికి ముఖ్య‌మంత్రి వ‌చ్చారు. వారి బాధ‌లు తెలుసుకున్నారు. ఇది చూసి ఓర్వ‌లేనిస స్థానిక రాజ‌కీయ శ‌క్తులు ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశాయి. ఉద్దానంలో రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ అక్క‌డ ప‌రిస్థితుల‌ను స్వ‌యంగా తెలుసుకుని స‌హాయ‌క చ‌ర్య‌ల్లో స్వ‌యంగా పాల్గొన్నారు. అక్క‌డ స‌హాయ‌క చ‌ర్య‌లుస స‌రిగ్గా సాగ‌డం లేద‌ని ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడులూ ఆయ‌న కాన్వాయ్‌ను కూడా అడ్డుకునేంద‌కు అక్క‌డ స్థానిక రాజ‌కీయ శ‌క్తులు ప్ర‌య‌త్నించాయి.

cycylonerajakeeyam 17102018

ప‌లాస ఎమ్మెల్యే గౌతు శివాజీ మంద‌స మండ‌లం హ‌రిపురంలో బాధితుల క‌ష్టాల‌ను తెలుసుకున్నారు. అక్క‌డ కొంత‌మంది ప్ర‌త‌పక్షాల‌కు చెందిన నేత‌లు స్థానికుల‌ను రెచ్చ‌గొట్టి ఆయ‌న వాహ‌నాన్ని అడ్డుకుని గంద‌ర‌గోళం సృష్టించే ప్ర‌య‌త్నం చేశారు. ఎన్‌.ఎన్‌.పేట మండ‌లంలో మిరియా ప‌ల్లిలో  స‌హాయ‌క చ‌ర్య‌లు సాఫీగా సాగిస్తూ అక్క‌డ ప్ర‌జ‌ల హృద‌యాల‌ను చూర‌గొంటున్న స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ శైల‌జ వాహ‌నాన్ని కూడా అడ్డుకునే అక్క‌డ స్థానిక రాజ‌కీయ శ‌క్తులు ప్రేరేపించాయి. త‌ద్వారా అక్క‌డ స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం క‌లిగించి రాజ‌కీయంగా లబ్ది పొందాల‌ని చూశాయి. సోంపేట మండ‌లం రుషికుడ్డ గ్రామంలో తుపాన్ స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షుస్తున్న ఐఏఎస్ అధికారి నిశాంత్ కుమార్‌ను నిల‌దీసేలా స్థానికుల‌ను అక్క‌డ స్థానిక విప‌క్ష నేత‌లు ప్రేరేపించారు. నిజానికి అక్క‌డ స‌హాయ‌క చ‌ర్య‌లు చాలా బాగా జ‌రుగుతున్నాయ‌ని కొంత‌మంది స్తానికులు చెప్ప‌డం గ‌మ‌నార్హం. కాశీబుగ్గ మండ‌లంలో తుపాన్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించి వారి బాధ‌లు తెలుసుకోవ‌డానికి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చిన సంద‌ర్భంగా అక్క‌డ ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు, క‌మ్యూనిస్టు పార్టీ నేత‌లు కొంత‌మంది అక్క‌డ స్థానిక మ‌హిళ‌ల‌ను రెచ్చ‌గొట్టారు. వారు ముఖ్య‌మంత్రి కాన్వాయ్‌ను అడ్డ‌కునేలా చేశారు. అయినా ముఖ్య‌మంత్రి వారిని క‌లుసుకుని వారి ఇబ్బందుల‌ను ఓపిగ్గా విని వాటి ప‌రిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు.

lokeshletter 17102018 2

15.10.2016.. మంద‌స  మండ‌లంలో జ‌డ్పీ ఛైర్మ‌న్ చౌద‌రి ధ‌న‌ల‌క్ష్మీని స్థానికులు నిల‌దీశారు. అయితే వారి వెనుక అక్క‌డ వైసీపీ నేత‌లు కొంత‌మంది ఉన్నారు. ఆందోళ‌న చేసిన‌ వారిలోనూ వైసీపీ కార్య‌క‌ర్త‌లు కొంద‌రు ఉండ‌టం గ‌మనార్హం. నిజానికి మంద‌స‌లో స‌హాయ‌క చ‌ర్య‌లు అత్యంత వేగంగా జ‌రుగుతున్నాయి. రెచ్చ‌గొట్టే మాట‌లు. శ్రీకాకుళం జిల్లాలో ఒక‌వైపు ముఖ్య‌మంత్రి మొద‌లు, మంత్ర‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, సిబ్బంది స‌ర్వం తుపాన్ బాధితుల‌కు స‌హాయ చేయ‌డం కోసం క్షేత్ర‌స్థాయిలో క‌ష్ట‌ప‌డుతుంటే విప‌క్ష పార్టీ నేత‌లు ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ధ‌ర్మాన ప్ర‌సాదరావు, భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, త‌మ్మినేని సీతారం, సీపీఐ, సీపీఎం నేత‌లు స్థానికంగా క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ అక్క‌డ ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టేలా ప్ర‌సంగాల చేస్తున్నారు. ప్ర‌భుత్వ అధికారుల‌ను నిల‌దీయండి అంటూ ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అధికారులు క్షేత్ర‌స్తాయిలో ప‌ర్య‌టించిన‌ప్పుడు వారి వాహ‌నాల‌ను అడ్డుకుని స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం క‌లిగించేలా స్థానిక తుపాన్ బాధితుల ముసుగులో స్థానిక కార్య‌క‌ర్త‌ల‌ను వ్యూహాత్మ‌కంగా ఉసిగొలుపుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read