ప్రకృతి మన రాష్ట్రం పై విలయతాండవం చేసింది. శ్రీకాకుళం జిల్లాలో తితలీ తుఫాను రూపంలో విరుచుకుపడింది. పెను విధ్వంసం సృష్టించింది. హూద్ హూద్ ను మించిన ఈ తుఫాన్ శ్రీకాకుళం వాసుల గుండె పై చెరగని గాయం చేసింది. లక్షలాది కొబ్బరి, జీడి , మామిడి చెట్లను నాశనం చేసింది. కరెంటు స్థంభాలు కూలిపోయాయి, మట్టి గోడలు ఉన్న ఇల్లు కూలిపోయాయి. అపార నష్టం వాటిల్లింది. మన మీడియా దీని గురించి అసలు పట్టించుకోకపోయినా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం, తుఫాను రెండు రోజుల ముందు నుంచే సమీక్షలు చేస్తూ, ప్రాణ నష్టం నివారించ గలిగారు. వెంటనే శ్రీకాకుళం వెళ్ళిపోయారు. గత నాలుగు రోజులుగా, ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అంతా పలాస నుంచే నడుస్తుంది.
ఎంతటి ఉపద్రవం కాకపోతే, ఒక ముఖ్యమంత్రి, 10 మంది మంత్రులు, వందల మంది అధికారులు, వేల మంది కార్మికులు అక్కడ నుంచి పని చేస్తున్నారు. అధికార పక్షం ఇలా పని చేస్తుంటే, ప్రతిపక్షం రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలి, కాని మన ఖర్మకు అలా లేదు. ప్రతిపక్ష నాయకుడు అక్కడే ఉన్నా, తన ముద్దుల యాత్ర చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక ఇంకో నాయకుడు అయితే, నాకు శ్రీకాకుళం అంటే ఎంతో ఇష్టం, నా జీవితం శ్రీకాకుళం వాసులకి అంకితం అంటూ కబుర్లు చెప్పాడు. చంద్రబాబు లేకపోయినా, మీకు నేను ఉన్నాను అంటూ, అవసరం లేనప్పుడు ఉత్తి మాటలు చెప్పాడు. నిజంగా అవసరం ఉన్నప్పుడు మాత్రం, స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లు వేసుకుని, ఎంజాయ్ చేస్తూ, కారులో కవాతులు చేస్తూ, రాజకీయ విమర్శలు చేసాడు పవన్.
కవాతు తరువాత మీటింగ్ పెట్టి, ఎదో పూనకం వచ్చిన వాడిలా ఊగిపోయాడు. చంద్రబాబు, లోకేష్ ల పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అయితే, పవన్ వ్యాఖ్యల పై కొంత మంది మీడియా ప్రతినిధులు, శ్రీకాకుళం తుఫాను బాధితుల సహాయ కార్యక్రమాల్లో ఉన్న లోకేష్ ని, ఆయన అభిప్రాయం అడిగారు. దీనికి లోకేష్, చాలా హుందాగా స్పందించారు." మన శ్రీకాకుళం ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. వారిని ఆదుకోవడానికి నిరంతరం కష్ట పడుతున్నాం. ప్రభుత్వ యంత్రాంగం అంతా పనులు మానుకుని, వీరు కోలుకునేలా మా ప్రయత్నం చేస్తున్నాం. తుఫాను ప్రభావిత ప్రాంతం కొలుకుని...సాధారణ పరిస్థితులు వచ్చే వరకూ ఇక్కడే ఉంటాం. ప్రస్తుతం ప్రజల సమస్యలు తీర్చడం కోసం ఏమి చెయ్యాలి అన్న ఆలోచన తప్ప మరొక దాని గురించి నేను ఆలోచించడం లేదు. రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. రాజకీయం మరో వేదిక పై మాట్లాడతాను." అంటూ లోకేష్ స్పందించన తీరు, పవన్ కళ్యాణ్ లాంటి బాధ్యత లేని వారికి ఒక చెంప పెట్టు. న్యు ఏజ్ పాలిటిక్స్ అంటే ఇలా ఉండాలి. అంతే కాని డ్రగ్స్ తీసుకున్న మనుషులులాగా, లేని ఎమోషన్ సృష్టించటం కోసం, ఊగిపోవటం కాదు.