వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడిపందాల కత్తితో జరిగిన దాడికి సంబంధించి.. ఘటనాస్థలంలో ఉన్న 15 మంది విపక్ష నేతలకు పోలీసులు నోటీసులు జారీచేశారు. విచారణకు హాజరుకావాలని రాజన్నదొర, కరణం ధర్మశ్రీ, మళ్ల విజయప్రసాద్‌, తైనాల విజయ్‌కుమార్‌, కేకే రాజు, సుధాకర్‌, చిన్నశ్రీను, కొండా రాజీవ్‌, వైసీపీ కార్యాలయంలో పనిచేస్తున్న కృష్ణకాంత్‌ సహా 15 మందికి సీఆర్‌పీసీ 160 సెక్షన్‌ కింద నోటీసులు అందజేశారు. దీనికి ఆ పార్టీ నేతలు ఎవరూ స్పందించలేదని సిట్‌ అధికారులు తెలిపారు. కృష్ణకాంత్‌ ఒక్కరే సోమవారం పోలీసుల ఎదుట హాజరై వాగ్మూలమిచ్చారు. ఇంకోవైపు దాడిచేసిన నిందితుడు శ్రీనివాసరావు ఇంటరాగేషన్‌ కొనసాగింది.

jagana 30102018 2

ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్‌లో సోమవారం కూడా విశాఖ పోలీసు కమిషనర్‌ మహేశ్‌చంద్ర లడ్డా, సిట్‌ అధికారులు అతడిని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో చర్చ జరగాలనే తాను దాడికి పాల్పడినట్లు అతడు పునరుద్ఘాటించాడు. శ్రీనివాసరావుకు ఎవరైనా డబ్బులిచ్చి జగన్‌పై దాడికి పురిగొల్పి ఉండొచ్చనే అనుమానంతో సిట్‌ అతడి బ్యాంకు ఖాతాలపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. అతడికి ముమ్మిడివరంలోని ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అమలాపురం విజయా బ్యాంకుల్లో ఉన్న ఖాతాల్లో ఎంత డబ్బుంది.. వాటి లావాదేవీల వివరాలు సోమవారం సేకరించారు. ఎస్‌బీఐలో మూడు నెలల క్రితం రూ.70 వేల లావాదేవీలు జరగగా.. ప్రస్తుతం రూ.320 మాత్రమే నగదు ఉన్నట్లు తెలిసింది. ఆంధ్రాబ్యాంకులో రూ.45 నిల్వ ఉంది.

 

jagana 30102018 3

అమలాపురం విజయా బ్యాంకులో కేవలం ఖాతా తెరిచినప్పుడు వేసిన రూ.1000 మాత్రమే ఉంది. మొత్తంగా మూడు ఖాతాల్లో ఉన్నది రూ.1365 మాత్రమే. కాగా.. శ్రీనివాసరావు ఎస్‌బీఐ బ్యాంకు ఖాతాలో అతడు విశాఖ విమానాశ్రయంలోని ఫ్యూజన్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌ యాజమాన్యం రూ.40 వేలు జమ చేసింది (జగన్‌పై దాడి చేయకముందు). ఆ మొత్తాన్ని అతడు అదేరోజు డ్రా చేసినట్లు తెలిసింది. ఇంకోవైపు.. ఈ రెస్టారెంట్‌లో శ్రీనివాసరావుతో పాటు పనిచేస్తున్న సిబ్బందిని, సీఐఎ్‌సఎఫ్‌ అధికారులను కూడా సిట్‌ ప్రశ్నించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read