2019 ఎన్నికలు కొత్త ఎత్తులకు, పొత్తులకు వేదికగా నిలుస్తున్నాయి. ఏ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భవించిందో అదే పార్టీతో కలిసి నడవబోతోంది. ఇప్పటి వరకు నీరూనిప్పులా ఉన్న కాంగ్రెస్, టీడీపీలు ఒకే వేదికను పంచుకోబోతున్నాయి. అయితే ఈ రెండు పార్టీలకు ఏకం చేసిన ఘనత ప్రధాని మోదీకి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు దక్కుతుంది. ఏపీ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన మోదీ తర్వాత యూ టర్న్ తీసుకున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే ఎన్‌డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది. ఎన్‌డీఏ నుంచి టీడీపీ వైదొలగిన వెంటనే ఏపీ కేబినేట్‌లో మంత్రులుగా ఉన్న ఇద్దరు బీజేపీ మంత్రులు రాజీనామా చేశారు. ఆ తర్వాత టీడీపీ అవినీతి వ్యతిరేకంగా బీజేపీ ప్రచారం చేయడం మొదలు పెట్టింది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

delhi 0112018 2

ఇది ఇలావుంటే కేంద్ర రాజకీయాల్లో సీఎం చంద్రబాబు మరోసారి కీలక పాత్ర పోషించబోతున్నారు. ఎన్‌డీఏ వ్యతిరేక పక్షాలను ఏకం చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. బుధవారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీలో మనం యాక్టివ్‌ కావాలని, బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకు వస్తామని చెప్పారు. ఢిల్లీలో రాహుల్‌తో మాట్లాడి అందరిని ఒకే వేదికపైకి తీసుకు వస్తానని స్పష్టం చేశారు. తనకు ప్రధాని పదవిపై కోరికలేదని, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దేశ రాజకీయాల్లో అందరికంటే ముందున్న వ్యక్తిని తానేనంటూ ప్రకటించారు. ప్రధాని పదవి చేపట్టాలని 1995లోనే తనపై ఒత్తిడి వచ్చిందని, రెండు సార్లు ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినా తిరస్కరించానని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో మాట్లాడి అందరినీ ఒకతాటిపైకి తీసుకువస్తానని చెప్పారు. అందరితో కలిసి జాతీయస్థాయిలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని స్పష్టం చేశారు.

delhi 0112018 3

‘‘బీజేపీ విధానాల వల్ల దేశం ప్రమాదంలో పడింది. దేశాన్ని ప్రమాదం నుంచి బయటపడేసేందుకే... నేను బాధ్యత తీసుకున్నాను. 40ఏళ్లుగా ప్రజాస్వామ్య విలువలు చూశాను. మోదీ, అమిత్‌షా ఎన్ని దాడులు చేసినా భయపడేది లేదు. టీడీపీ దేశానికి ఎన్నోసార్లు దశదిశ చూపింది. ఇప్పుడు మరోసారి దేశరాజకీయాల్లో కీలకపాత్ర షోషించాల్సిన సమయం వచ్చింది’’ అని చంద్రబాబు చెప్పారు. ఆయన ప్రకటించినట్లే చంద్రబాబు.. ఈ రోజు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. వారం వ్యవధిలోనే ఆయన రెండు సార్లు ఢిల్లీ పర్యటిస్తున్నారు. ఈ నెల 27న ఢిల్లీలో పర్యటించి పలు పార్టీల నేతలను కలిశారు. చంద్రబాబు కలిసిన వారిలో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, మాయావతిని కలిశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read