ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్‌ పటేల్‌ విగ్రహం ఏర్పాటు చేయడంలో మోదీ సఫలీకృతమయ్యారని... కానీ పటేల్‌ సమైక్య స్ఫూర్తిని కాపాడటంలో మోదీ విఫలమయ్యా రు. దేశంలో ఎక్కువ మంది మాట్లాడే మూడో అతిపెద్ద భాష తెలుగుకు స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ వద్ద గుర్తింపు లభించకపోవడం బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. తెలుగు తల్లి బిడ్డగా తన మనసు క్షోభిస్తోందన్నారు. పైసా ఖర్చు లేని ఇలాంటి విషయాల్లో కూడా తెలుగువారంటే ఇంత వివక్షా? అని ప్రశ్నించారు. తెలుగువారంతా తమ ఆవేదనను వ్యక్తం చేయవలసిన తరుణమిది అని ట్విట్టర్‌లో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

cbn tweet 01112018 2

"భారత దేశంలో ఎక్కువ మంది మాట్లాడే మూడవ అతి పెద్దదైన తెలుగు భాషకు #StatueOfUnity వద్ద గుర్తింపు లభించక పోవటంతో తెలుగు తల్లి బిడ్డగా నా మనసు క్షోభిస్తోంది. పైసా ఖర్చు లేని ఇటువంటి విషయాలలో కూడా తెలుగు వారంటే ఇంత వివక్షా?ప్రతి తెలుగు వారూ అలోచించి,తమ ఆవేదనను వ్యక్తం చేయవలసిన తరుణమిది" అంటూ చంద్రబాబు ట్వీట్ చేసారు.

cbn tweet 01112018 3

భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో మూడో స్థానంలో ఉన్న తెలుగుకు స్టాట్యూట్‌ ఆఫ్‌ యూనిటీ వద్ద గుర్తింపు లభించకపోవడం తెలుగు బిడ్డగా తన మనసు క్షోభిస్తోందని మంత్రి నారా లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాల్లో కూడా తెలుగువారంటే కేంద్రానికి ఇంత వివక్షా? అని నిలదీశారు. ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి తన ఆవేదనను వ్యక్తం చేయాల్సిన తరుణమిదని అన్నారు. ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో నరేంద్ర మోదీ సఫలీకృతం అయ్యారు.. కానీ పటేల్‌ సమైక్య స్ఫూర్తిని కాపాడటంలో మాత్రం విఫలమయ్యారని విమర్శించారు. ఐక్యతా ప్రతిమ ఏర్పాటులో తెలుగుని విస్మరించడం ద్వారా భాజపా తెలుగువారి ఆత్మగౌరవాన్ని మరోసారి దెబ్బతీసిందని లోకేశ్‌ ఆక్షేపించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read