నరేంద్ర మోడీ, అమిత్ షా.. వీళ్ళద్దరూ అధికారంలోకి వచ్చిన తరువాత, ది మోస్ట్ పవర్ఫుల్.. ప్రత్యర్ధి పార్టీలు, అధికారులు, వ్యవస్థలు అన్నీ వీళ్ళ ముందు మోకరిల్లాయి. మన రాష్ట్రంలో, ఇంతకే ముందు మోడీ, షా పై విమర్శలు చేసిన వాళ్ళు, ఎలా లొంగిపోయారో చూస్తున్నాం. ఏడాది క్రితం చంద్రబాబు మోడీ-షా పై తిరుగుతుబాటు చేసే దాకా, వాళ్లకి ఎదురు లేదు. చివరకు పార్లమెంట్ సాక్షిగా, ఉతికి ఆరేసారు టిడిపి ఎంపీలు.. నువ్వో పెద్ద ఆక్టర్ వి అని అనేసారు. అప్పటి నుంచి, కొంచెం తిరుగుబాటు మొదలైంది. ప్రాంతీయ పార్టీలు ఏకం అవుతున్నాయి. రాహుల్ పుంజుకుంటున్నాడు. ఈ తరుణంలో, మోడీ-షా మరింతగా రెచ్చిపోతున్నారు. రాఫెల్ డీల్ పై సిబిఐ ఎంక్వయిరీ వేస్తే ఇబ్బంది అవుతుందని, సిబిఐ డైరెక్టర్ అలోక్‌వర్మ, మన మాట వినడాని, మనకు అనుకూలమిన ఆస్థానాను అందలం ఎక్కించటానికి ప్లాన్ చేసారు.
చివరకు అలోక్ వర్మ పై తప్పుడు ఆరోపణలు మోపి, ఇదే కేసులో సియం రమేష్ ని కూడా ఇరికించి, అటు అలోక్ వర్మని, ఇటు తెలుగుదేశం పార్టీని దోషిగా నిలబెట్టె ప్రయత్నం చేసారు. ఇవన్నీ పసిగట్టిన అలోక్ వర్మ, ఆస్థానా తన పై పన్నిన కుట్రను భగ్నం చేసి, అతన్ని, అతని కింద ఉన్న డీఎస్పీని అరెస్ట్ చేసారు. అయితే, ఈ విషయం రచ్చ రచ్చ అవ్వటంతో మోడీ అనూహ్యంగా, అలోక్ వర్మను, ఇటు ఆస్థానా పై కూడా వేటు వేసి, కొత్త డైరెక్టర్ ని నియమించారు. ఆ కొత్త డైరెక్టర్ కూడా మోడీ మనిషిగా పేరు ఉంది. కొత్త డైరెక్టర్ ను నియమించగానే సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. సిబిఐలో తనకు అనుకూలంగా లేని అధికారులు మొత్తాన్ని కేంద్రం ట్రాన్స్ఫర్ చేపించింది.
అన్నిటికంటే హైలైట్ ఏంటి అంటే, ఆస్థానా కేసులో దర్యాప్తు చేస్తున్న డిప్యూటీ ఎస్పీ ఏకే బస్సీని అండమాన్ లోని, పోర్ట్‌బ్లయర్‌కు బదిలీ చేశారు. తక్షణమే ఈ బదిలీలు, మార్పులు అమల్లోకి వచ్చినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. మరో 13 మంది అధికారులను బదిలీ చేశారు. వీరిలో ఆస్థానా కేసు విచారిస్తున్న ముగ్గురు అధికారులు కూడా ఉన్నారు. అంతేగాక.. ఆస్థానాపై ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్న బృందాన్ని తొలగించి కొత్త బృందాన్ని కూడా ఏర్పాటుచేశారు. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఎవరన్నా అధికారి చెప్పిన మాట వినకపోతే, అండమాన్ ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరిస్తారు. ఇక్కడ అచ్చంగా అలాగే జరిగింది. మోడీ మనిషి, ఆస్థానా పై విచారణ చేస్తున్న అధికారిని, అండమాన్ ట్రాన్స్ఫర్ చేసారు. మోడీ పగబడితే ఇలాగే ఉంటుంది మరి.