రాష్ట్రంలో మరోసారి ఐటీదాడులు జరుగుతాయన్న సమాచారం తీవ్ర కలకలం రేపుతోంది. విశాఖపట్నంలో రేపు భారీగా ఐటీ దాడులు జరిగే అవకాముందని సమాచారం. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి ఐటీ అధికారులు విశాఖ నగరానికి చేరుకున్నారని, వారంతా వివిధ హోటళ్లలో బసచేసినట్లు సమాచారం. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలతో పాటు చెన్నై, బెంగళూరు నగరాల నుంచి ఐటీ అధికారులు వివిధ మార్గాల నుంచి విశాఖ చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలోని కీలక నేతలు, వ్యాపార సంస్థలు, పారిశ్రామిక వేత్తలపై ఐటీ శాఖ అధికారులు దృష్టి పడినట్టు తెలుస్తోంది. రేపు ఉదయం 7 గంటల నుంచి దాడులకు సిద్ధంగా ఉండాలని టీమ్ సభ్యులకు అధికారులు సమాచారం ఇచ్చినట్లుగా తెలియవచ్చింది.
అయితే ఈ దాడులు జరుగుతున్న సందర్భం చూస్తే, మన రాష్ట్రం పై, ఢిల్లీ పెద్దలు ఎంత కక్ష కట్టారో అర్ధమవుతుంది. తెలుగుదేశం నాయకులు కూడా ఇదే విషయం చెప్తున్నారు. అమరావతి, తిరుపతి, వైజాగ్ నగరాలని, చంద్రబాబు ఒక పధ్ధతి ప్రకారం అభివృద్ది వైపు పరుగులు పెట్టిస్తుంటే, మోడీ కావాలనే టార్గెట్ చేస్తున్నాడని చెప్తున్నారు. ఈ టైములో, మోడీ నజర్ విశాఖపట్నం పై పడటానికి కారణం చెప్తూ, "విశాఖపట్నం కి అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది...ఫింటెక్ రంగంలో ప్రపంచంలోనే 4వ ఉత్తమ వేదిక గా విశాఖ ఎదిగింది. ఐటీ కంపెనీలు అన్ని విశాఖకు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశమే మోడీకి నచ్చలేదు. ఎలా ఆయినా అలజడి సృష్టించాలి...విశాఖ కి వస్తున్న వారిని భయబ్రాంతులకు గురిచేయ్యాలి, విశాఖపట్నం కి వస్తున్న కంపెనీలు అన్ని గుజరాత్ కి తరలించాలి అనే కుట్ర తో విశాఖపట్నం పై టార్గెట్ పెట్టాడు మోడీ" అంటూ ఓ సీనియర్ మంత్రి వాపోయారు.
"ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫింటెక్ ఫెస్టివల్ ఒక పక్క, మరో పక్క ఇండియా,వెస్టిండీస్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో విశాఖ ని కొట్టాలి అని మోడీ ఆదేశించారు. దింతో విశాఖలో 20 ఐటీ బృందాలు దిగాయి..ఇతర రాష్ట్రాల బృందాలను కూడా విశాఖకి పంపారు మోడీ. అంతర్జాతీయ ప్రతినిధులు విశాఖ లో ఉన్న సమయంలోనే ఐటీ దాడుల వార్తలు వచ్చి...వారంతా ఆంధ్రప్రదేశ్ కి వచ్చే ఆలోచన విరమించుకోవాలి...అందరూ గుజరాత్ వెళ్లాలి అనేది మోడీ గారి ఆలోచన" అంటూ ఆ సీనియర్ మంత్రి చెప్పుకొచ్చారు. మొత్తానికి, విశాఖలో రేపు ఐటి వాళ్ళు ఏమి చేస్తారో చూడాలి.