అమెరికాలో బాంబ్ పార్శిళ్లు తీవ్రకలకం రేపుతున్నాయి. వైట్‌హౌజ్ సహా అమెరికా మాజీ ప్రెసిడెంట్స్ బరాక్ ఒబామా, బిల్ క్లింటన్‌ దంపతులను దుండగులు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు వారి ఇళ్లు, కార్యాలయాలకు పేలుడు పదార్థాల పార్శిళ్లను పంపించారు. ఈ కుట్రను సీక్రెట్ సర్వీస్ అధికారులు బుధవారం భగ్నం చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా‌, మాజీ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ హిల్లరీ క్లింటన్‌ అడ్రస్ మీద పేలుడు పదార్థాల పార్శిల్స్‌ వచ్చినట్లు సీక్రెట్‌ సర్వీసెస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. సాధారణ తనిఖీల్లో భాగంగా హిల్లరీ ఆఫీస్‌కు వచ్చిన పార్శిల్‌ను తనిఖీ‌ చేయగా ఇవి లభ్యమైనట్లు తెలిపంది. ఈ వ్యవహారంపై యూఎస్‌ ఎఫ్‌బీఐ అధికారులు విచారణ చేస్తున్నారు.

usa 24102018 2

ఇటీవలే బిలియనీర్‌ జార్జ్‌ సోరోస్‌ ఇంటికి వచ్చినటువంటి పార్శిళ్లే ఒబామా, హిల్లరీ కార్యాలయాలకు కూడా రావడం కలకలం రేపుతోంది. సాధారణ తనిఖీల్లో భాగంగా హిల్లరీ ఆఫీస్‌కు వచ్చిన పార్శిల్‌ను తనిఖీ‌ చేయగా ఇవి లభ్యమైనట్లు సీక్రెట్‌ సర్వీసెస్‌ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. దీనిపై యూఎస్‌ ఎఫ్‌బీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదు. ఆ పార్శిళ్లు ఎక్కడ నుంచి వచ్చాయనే విషయం తెలియరాలేదు. సోరోస్‌ ఇంటికి వచ్చిన పార్శిల్‌ను స్కానింగ్‌ చేస్తున్న సమయంలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించడంతో వెంటనే బాంబు నిర్వీర్య బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఆ ప్యాకెట్‌ను తీసుకెళ్లి బాంబును నిర్వీర్యం చేసినట్లు యూఎస్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి.

usa 24102018 3

న్యూయార్క్‌లో మీడియా కార్యాలయాలు ఉన్న టైమ్‌ వార్నర్‌ సెంటర్‌ భవనంలో పోలీసులు అనుమానాస్పద వస్తువును కనుగొన్నట్లు సీఎన్‌ఎన్‌ పేర్కొంది. ఈ భవనంలోని అన్ని కార్యాలయాలను ఖాళీ చేయించారు. ఈ విషయాన్ని సీఎన్‌ఎన్‌ అధ్యక్షుడు జెఫ్‌ జుకెర్‌ కూడా ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌ లో వెల్లడించారు. మరో పక్క శ్వేత సౌధం చిరునామాతో కూడా ఒక అనుమానాస్పద పార్శిల్‌ వచ్చినట్లు సీఎన్‌ఎన్‌ పేర్కొంది. దీనిపై సీక్రెట్‌ సర్వీస్‌ స్పందిస్తూ తాము కేవలం ఒబామా, క్లింటన్‌ కార్యాలయాలకు వచ్చిన పార్శిళ్లను మాత్రమే స్వాధీనం చేసుకొన్నామని పేర్కొంది. ఒబామా, బిల్‌ క్లింటన్‌‌పై జరిగిన కుట్రను ఖండిస్తున్నట్లు ప్రతినిధి సారా శాండర్స్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి ఉగ్రవాద చర్యలను సహించేది లేదని..కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read