ప్లెక్సీలు కట్టే అభిమానులు లేరు... ఫ్యాన్సీ షో అని 500 లు పెట్టి టికెట్ కొనే వారు లేరు.. చేతిలో అర డజన్ల సినమాలు లేవు.. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే... అసలు ఆయనది మన ఆంధ్రానే కాదు.. అయినా తన సినిమాలను ఏదో సమయంలో, ఆదరించారనే మంచి హృదయం... రాజశేఖర్ దంపతులు తిత్లీ తుఫాను భాదితులకు పది లక్షల విరాళం ఇచ్చారు... జీవిత, రాజశేఖర్ రూ.10 లక్షల చెక్కును సాయంత్రం ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి అందజేశారు. తుఫాను బాధితులకు మా వంతు సాయం ఇది అంటూ ఇచ్చారు. ఇప్పటికే కొంత మంది సినీ స్టార్స్ ముందుకొచ్చినా, చాలా మంది టాప్ హీరోలు, కనీసం రూపాయి ఇవ్వలేదు. బాలకృష్ణ, అల్లు అర్జున్, ఎన్టీఆర్, కళ్యాణ్ రాం, విజయ్ దేవరకొండ, నిఖిల్, మనోజ్, సంపుర్నేష్ బాబుతో సహా కొంత మంది చిన్న హీరోలు విరాళం ఇచ్చారు, ఇంకా ఎంతో మంది టాప్ హీరోలు ఉన్నా, వాళ్ళు మాత్రం అడ్రస్ లేరు. ప్రతి సినిమా టికెట్ కొనే ముందు, వీడు మన ఆంధ్రుల కు ఏమైనా ఉపయోగ పడ్డాడ, లేదా అని ఒక్క నిమిషం ఆలోచించాల్సిన పరిస్థితి..
మరో పక్క, చంద్రబాబు నాయుడు మంగళవారం విశాఖ పర్యటనలో ఉండగా తిత్లీ తుఫాను బాధితుల సహయార్థం వివిధ సంస్థల యజమానులు, పలువురు ప్రముఖులు చెక్కు రూపంలో రూ.35 లక్షల విరాళాలను సీఎం చంద్రబాబు నాయుడుకి అందజేశారు. చెక్కులు అందించిన వారిలో… సరనివాస విద్యా పరిషత్ రూ.2 లక్షలు, వాల్తేరు క్లబ్ రూ.7 లక్షలు, ఆర్కే ఈసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.10 లక్షలు, సీయోన్ ఫార్మా లిమిటెడ్ రూ.2 లక్షలు, చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ రూ1.50 లక్షలు, వైభవ్ రూ.1.06 లక్షలు, సీన్ లియో సిస్టమ్స్ రూ.1 లక్ష, విశాఖ ఇన్ఫ్రా సర్వీసెస్ రూ.1 లక్ష, దజకో ఇండియా లిమిటెడ్ రూ.1లక్ష, కంకటలా టెక్స్ టైల్స్ విశాఖ రూ.1 లక్ష, సన్ ఎడ్యుకేషల్ ఇనిస్టిట్యూట్ రూ.1 లక్ష
కొరమండల్ ప్రాజెక్ట్స్ రూ.1 లక్ష, కుమారరాజ ప్రైవైట్ లిమిటెడ్ రూ.1 లక్ష, ఎస్‌విబిసి గోల్డ్ రూ.1 లక్ష, పివిఎస్ జేమ్స్జూలియర్స్ రూ.1లక్ష, ఏ.వెంకట ప్రసాద్ రూ.50వేలు, మనోజ్ వైభవ్ రూ.50.వేలు, పళని ఎవెన్యూస్ లిమిటెడ్ రూ.50.వేలు, నోబుల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ రూ.25.వేలు, అస్ర్జిన్ ఫార్మా లిమిటెడ్ రూ.20వేలు, వి.శ్రీనివాసరావు రూ.20 వేలు, విశాఖ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ రూ.20 వేలు, అభిషేక్ పవర్ సిస్టమ్ రూ.15 వేలు అందజేశారు. అదేవిధంగా హైదరాబాద్‌కు చెందిన భవ్య సిమెంట్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ అధినేత ఆనందప్రసాద్ తిత్లీ తుఫాను బాధితుల సహాయార్థం రూ.10 లక్షల చెక్కును మంగళవారం సాయంత్రం ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి అందజేశారు. అలాగే ఎంఎస్ విశాఖ ఫిలింనగర్ సెంటర్ రూ.5 లక్షల విరాళం ఇచ్చారు.