అభివృద్ధిలో దూసుకుపోతోంది. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ‘మిషన్ అంత్యోదయ’ ద్వారా దేశవ్యాప్తంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పౌరసేవలకు సంబంధించి నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేసిం ది. సర్వేలో ఏపీలోని 118గ్రామాలు మొదటి 10ర్యాంకుల్లో ఉండటం విశేషం. గ్రామీణాభివృద్ధిలో కీలకమైన మౌలిక సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి, జీవనోపాధి, సాగునీటి వనరులు, ఆరోగ్యం, పౌష్టికాహారం, మహిళా సాధికారత తదితరాలను పరిగణనలోకి తీసుకుని సుమారు 1.6లక్షల పంచాయతీలను ఎంపిక చేసి విశ్లేషణాత్మకంగా సర్వే నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో ఒకే ర్యాంక్ 2అంతకుమించి గ్రామ పంచాయతీలకు లభించింది. మొదటి 10 ర్యాంకు ల్లో దేశవ్యాప్తంగా 210 గ్రామాలు స్థానం పొందగా, వాటిలో ఏపీకి చెందిన గ్రామాలే 118ఉన్నాయి.
ఇవన్నీ అంత్యోదయ పథకం అమలవుతున్న గ్రామాలు. 2017 అక్టోబరులో 50వేల గ్రామ పంచాయతీల్లో ప్రాథమిక సర్వేచేపట్టారు. అదే క్రమంలో ఈ ఏడాది నవంబరులోగా 2.5లక్షల గ్రామాల్లో ఈ కసరత్తు పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ధిశాఖ సంకల్పించింది. ఏపీలోని పలు గ్రామాలు బహుముఖాభివృద్ధిలో ఉన్నాయని సర్వే ద్వారా స్పష్టమవుతోంది. సీఎం చంద్రబాబు ప్రత్యేక పర్యవేక్షణతో గ్రామాలు మౌలికంగా అభివృద్ధి సాధిస్తున్నాయనడానికి ఇదే తార్కాణం. పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, ప్రజలకు అందుతున్న మౌలిక సౌకర్యాలు వంటి అంశాలపై కూడా కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ విశ్లేషణాత్మక సర్వే కొనసాగిస్తోంది.
కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ పారిశుద్ధ్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణ, ప్రజలకు అందుతున్న వౌలిక సదుపాయాలు తదితర అంశాలపై విశే్లషణాత్మక సర్వే కొనసాగిస్తోంది. మలమూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా దేశవ్యాప్తంగా 58శాతం గ్రామాలు ఉన్నట్లు గుర్తించింది. 21 శాతం గ్రామాలు సామాజిక వ్యర్థ నిర్వహణ పద్దతులను కచ్చితంగా అమలు చేస్తున్నాయని, 75 శాతం మంది గృహ వినియోగదారులు ఎల్పీజీ, బయోగ్యాస్ వంటి కాలుష్యరహిత ఇంధన వనరులను వినియోగిస్తున్నారని సర్వే వివరించింది. రాష్ట్రంలో 92 మార్కులతో చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీరామాపురం గ్రామ పంచాయతీ మొదటి పది స్థానాలు సాధించిన 97 గ్రామాల్లో రెండో స్థానం దక్కించుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన పది గ్రామాలు, విశాఖపట్నం జిల్లాకు చెందిన మరో పది గ్రామాలు మొదటి పది ర్యాంక్‌లలో ప్రత్యేకతను చాటుకున్నాయి.