పలమనేరుకు చెందిన వైసీపీ నేత రాకేష్‌ రెడ్డి నిర్మాతగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ రూపొందించనున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌(అసలు కథ) చిత్రం ప్రారంభోత్సవానికి తిరుచానూరు సమీపంలోని శిల్పారామం వేదికైంది. శుక్రవారం సాయంత్రం శిల్పారామంలో రామ్‌గోపాల్‌ వర్మ క్లాప్‌ కొట్టి చిత్రం షూటింగును ప్రారంభించారు. అనంతరం లక్ష్మీపార్వతి తదితరులతో కలసి చిత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమం ఆద్యంతం వైసీపీ నేతల హడావుడే కన్పించింది. ముగ్గురు ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, పార్టీ నాయకులు ఆదిమూలం, గణపతి నాయుడు తదితరులతో పాటు పలువురు కార్యకర్తలు విచ్చేశారు.

varma 20102018 2

ఒకరోజు ముందే జిల్లాలోని వైసీపీ నేతల ఫొటోలతో రామ్‌గోపాల్‌ వర్మకు స్వాగతం పలుకుతూ శిల్పారామం వద్ద ప్లెక్సీలు ఏర్పాటుచేశారు. సినిమా ప్రారంభోత్సవ సందర్భంగా రామ్‌గోపాల్‌ వర్మ ప్రసంగించిన తరువాత పాత్రికేయులు సినిమా వెనుక వైసీపీ పాత్ర గురించి అడిగారు. వైసీపీ కార్యకర్తలు రామ్‌గోపాల్‌వర్మకు అండగా నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. మరో వారం పాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం షూటింగ్‌ ఉంటుందని రామ్‌గోపాల్‌వర్మ వివరించారు. జనవరి 24న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

varma 20102018 3

రాజకీయ ఉద్దేశంతో కాకుండా ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలను కళ్ళకు కట్టినట్లు చక్కగా చూపిస్తామని నిర్మాత రాకేష్‌ రెడ్డి చెప్పారు. గగతంలో హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్ హోటల్లో దర్శకుడు రాంగోపాల్ వర్మ, వైసీపీ అధినేత జగన్ బావ బ్రదర్ అనిల్ సమావేశమయ్యారు. అత్యంత రహస్యంగా జరిగిన ఈ సమావేశంలో జగన్ పెదనాన్న కుమారుడు వైఎస్ అనిల్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. వీరితో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత రాకేష్‌రెడ్డి కూడా ఉన్నారు. అయితే ఎందుకో కాని, అప్పట్లో ఆ సినిమాను పక్కన పెట్టేసిన వర్మ, ఇప్పుడు మళ్ళీ పక్కన లక్ష్మీ పార్వతిని వేసుకుని, తిరుపతిలో ప్రత్యక్షం అయ్యారు. ఈ రోజు సినిమాని మొదలు పెడుతున్నా అంటూ హడావిడి చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read