మొన్నటి దాకా తెలంగాణాలో కేసీఆర్ ఓడిపోతాడని, ఎవరైనా అనుకున్నారా ? ఎవరిని అడిగినా, వంద సీట్లు గ్యారెంటీ అన్నారు. కేసీఆర్, కేటీఆర్ అదే అహంకారంతో, చంద్రబాబుని పిచ్చి బూతులు తిట్టటం మొదలు పెట్టారు. అయితే, చంద్రబాబు వేసిన ఒకే ఒక్క దెబ్బతో, ఇప్పుడు గిల గిల కొట్టుకుంటున్నారు. వంద సీట్లు దగ్గర నుంచి, కేసీఆర్ గట్తెక్కుతాడా అనే దాకా యవ్వారం వచ్చింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు కేసీఆర్‌ను ఎదుర్కొవడం విపక్షాలకు కష్టమేనన్న అభిప్రాయం వినిపించింది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ మహాకూటమిగా ఏర్పడిన తర్వాత రాజకీయ పరిస్థితుల్లో అనూహ్యమైన మార్పులొస్తున్నాయన్న భావన ఏర్పడింది. టీఆర్‌ఎస్ మహాకూటమి గట్టి పోటీ ఇస్తుందన్న అభిప్రాయాన్ని రాజకీయవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

modi 04112018 2

ఇదే ఫార్ములాను దేశం మొత్తం అమలు చేస్తున్నారు చంద్రబాబు. ప్రధానమంత్రి అభ్యర్థి అనే మాట రాకుండా... ముందుగా మోదీని ఎదుర్కోవడానికి దేశం మొత్తం ఏకమైందనే భావన తెప్పించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే రాహుల్‌ను కలిశారు. రాహుల్‌గాంధీతో భేటీ తర్వాత ఏపీలో పరిస్ధితి ఏమిటీ? కాంగ్రెస్‌తో సీట్లు సర్దుబాటు చేసుకుంటారా? జాతీయ స్థాయిలో పోరాటానికే కూటమి పరిమితమా? సీఎం చంద్రబాబు, రాహుల్‌గాంధీతో భేటీ అయిన తర్వాత ఏపీ రాజకీయవర్గాల్లో మెదిలిన ప్రశ్నలివి. అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత చంద్రబాబు ముందడుగు వేస్తారు. చంద్రబాబు రాజకీయ సమీకరణాల్లో చాలా పక్కగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీతో బంధం విషయంలోనూ ఆయన అదే పంథాలో ఉన్నారన్న దానికి స్పష్టమైన సూచనలు బయటకు వస్తున్నాయి.

modi 04112018 3

ఢిల్లీలో రాహుల్‌తో బాబు భేటీ తర్వాత ఏపీలో ఆ పార్టీతో పొత్తు ఖారారైందన్నట్లుగా కొంతమంది ప్రచారం చేస్తూ ఉండడాన్ని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు స్పష్టమైన సూచనలు పంపించారు చంద్రబాబు. ఏపీలో పొత్తుల ప్రస్తావన లేదని కేవలం జాతీయ స్ధాయిలో కూటమి విషయంలో మాత్రమే కాంగ్రెస్‌తో కలిసి పనిచేయబోతున్నామని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంపై పార్టీ అంతర్గత సమావేశాల్లో తేల్చిచెబుతున్నారు కూడా. బీజేపీని ఢిల్లీలో మళ్లీ అధికారంలోకి రాకుండా చేయటమే ప్రస్తుతం చంద్రబాబు లక్ష్యం. దానికోసం కొన్ని ప్రాంతీయ పార్టీలతో కూటమి పెట్టినా... ప్రజల్లో విశ్వాసం కలగదనే విశ్వాసానికి వచ్చారు. ఓ వైపు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ బలంగా ఉంది. అలాంటి బీజేపీని ఓడించాలంటే విడివిడిగా సాధ్యం కాదు. పునరేకీకరణ జరగాలి. బీజేపీని వ్యతిరేకించే వారంతా ఏక తాటిపైకి వచ్చి పోటీ చేయాలి. అప్పుడే బీజేపీకి ప్రత్యామ్నాయం ఉందన్న భావన ప్రజలకు వస్తుంది. ఇక్కడ తెలంగాణాలో ఇదే ఫార్ములా సక్సెస్ అవ్వటంతో, జాతీయ స్థాయిలో కూడా ఇదే పంధా ఎంచుకున్నారు చంద్రబాబు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read