ఆంధ్రుల ఆశల సౌధం... అమరావతిలోని సచివాలయ నిర్మాణాల పనులు మొదలయ్యాయి. ప్రపంచంలోని ప్రముఖ కార్పొరేట్‌ సంస్థల కార్యాలయాలను తలదన్నేలా... ఆధునిక హంగులతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయ భవనాల నిర్మాణాన్ని చేపడుతున్నారు. అమరావతి అంటే అది పీపుల్స్ కేపిటల్... అది వన్ అఫ్ ది బెస్ట్ కాదు, ది బెస్ట్ కావలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో సార్లు మేధో మధనం చేసి, మైన్యూట్ విషయాలు కూడా పర్ఫెక్షన్ వచ్చేలా చేసి, డిజైన్లు ఫైనల్ చేసారు... ఈ ప్రక్రియ కొంచెం ఆలస్యం అయినా, డిజైన్లు ప్రజలందరికీ నచ్చాయి... మరో పక్క, భ్రమరావతి అనే హేళన చేసే బ్యాచ్ ఉంటానే ఉంది... ఇవన్నీ పక్కన పెడితే, అమరావతి నిర్మాణాల పై దూకుడు పెరిగింది.

amaravati 041123018 2

ఒక పక్క ఐఏఎస్, ఐపిఎస్, ఎమ్మల్యే, మినిస్టర్, ఉద్యోగుల హౌసింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో పక్క రోడ్లు అన్నీ రెడీ అవుతున్నాయి. హై కోర్ట్ నిర్మాణం జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సచివాలయ నిర్మాణం కూడా మొదలైంది. గ్రాఫిక్స్ అనే ఏడ్చే బ్యాచ్, ఇకనుంచి నేల కుంగింది, నిర్మాణంలో బీటలు వచ్చాయి, భూకంపం వస్తుంది లాంటి సొల్లు చెప్పే రోజులు వచ్చయి. ఏది చేసినా వీళ్ళ ఏడుపు కామన్ కదా... ఇక సచివాలయ నిర్మాణం గురించి చెప్పాలంటే, శాసనసభ భవనానికి పశ్చిమ దిశలో, ఐదు టవర్లు నిర్మాణం మొదలైంది. ఇప్పటిలా సచివాలయం ఒక చోట, విభాగాధిపతుల కార్యాలయాలు మరో చోట ఉండకూడదన్న ఉద్దేశంతో, పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్నీ ఒకే చోట ఏర్పాటయ్యేలా ఆకృతులు తీర్చిదిద్దారు.

amaravati 041123018 3

మొత్తం 41 ఎకరాల విస్తీర్ణంలో సచివాలయ భవనాలు నిర్మిస్తారు. ఐదు టవర్లతో పాటు, అదే ప్రాంగణంలో తొమ్మిది పోడియంలు కూడా ఉంటాయి. ముఖ్యమంత్రి కార్యాలయ భవనంలో 50 అంతస్తులు ఉంటాయి. దీని ఎత్తు 212 మీటర్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సచివాలయ భవనంగా నిలుస్తుంది. మిగతా నాలుగు టవర్లలో (టీ1, టీ2, టీ3, టీ4) 40 అంతస్తుల చొప్పున ఉంటాయి. మొత్తం సచివాలయ భవనాల నిర్మిత ప్రాంతం: 69.8 లక్షల చ.అడుగులు. ప్రాజెక్టు అంచనా వ్యయం: రూ.4 వేల కోట్లు. ప్రస్తుతం జరుగుతున్న పనుల విలువ: రూ.2271 కోట్లు. రెండేళ్లలో వీటిని పూర్తి చేయాలన్నది లక్ష్యం. స్తుత పరిస్థితి ఐదు టవర్ల పునాదుల నిర్మాణానికి తవ్వకాలు జరిపారు. ముఖ్యమంత్రి కార్యాలయ భవనం టవర్‌కు ర్యాఫ్ట్‌ నిర్మాణం మొదలైంది. డిసెంబరు 15కి పునాదులు పూర్తి చేసి, భవనం పనులు ప్రారంభిస్తారు. సంప్రదాయ ప్రభుత్వ కార్యాలయాలకు భిన్నంగా... సమున్నతంగా... ఈ భవనాలను తీర్చిదిద్దనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read