మూడు రోజుల క్రితం, మందడంలో మహిళలను పోలీసులు అరెస్ట్ చెయ్యటంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. మహిళలను అరెస్ట్ చెయ్యటంతో పాటుగా, వారిని లాగి పడేయటం, బూతులు తిట్టటం కూడా చేసారు అంటూ, కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఆ రోజు పోలీసులు స్పందిస్తూ, మహిళలు రోడ్డుకు అడ్డుగా ఉండటంతో, వారిని తప్పించే క్రమంలో, కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని, ఆ సందర్భంగా మహిళలకు చిన్న చిన్న గాయాలు అయ్యాయని, మేము కావాలని వారి పై దురుసుగా ప్రవర్తించలేదు అని చెప్పారు. అయితే, ఈ రోజు ఉదయం, పోలీసులు మొన్న జరిగిన సంఘటన పై ప్రెస్ మీట్ పెట్టరు. మందడంలో పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా, వారు మాట్లాడుతూ, మహిళలే పోలీసుల పై ఎదురు తిరిగారని, మహిళా కానిస్టేబుళ్ల పై వారే, దాడి చేశారని తుళ్లూరు డీఎస్పీ వెల్లడించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా మీడియాకు విడుదల చేసారు.

police 06012020 2

అయితే ఈ సందర్భంగా మీడియా కొన్ని ప్రశ్నలు అడిగింది. కానిస్టేబుళ్ల పై దాడి జరిగితే ఆ రోజే, ఎందుకు చెప్పలేదని, మూడు రోజుల తరువాత ఎందుకు చెప్తున్నారు అంటూ పోలీసులని ప్రశ్నించగా, మీడియా ప్రశ్నలకు పోలీసులు సమాధానం దాటవేశారు. పోలీసుల స్పందన పై, రాజధాని రైతులు స్పందిస్తూ, పోలీసులు పొంతనలేని సమాధానాలు చెప్తున్నారని, ఆ రోజు ఏమి జరిగిందో, మీడియాలో మొత్తం, రాష్ట్ర ప్రజలు అందరూ చూసారని వాపోయారు. మేము కొడితే, దాడి చేస్తే, పోలీసులు మమ్మల్ని వదిలి పెట్టే వారా అని ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు మాత్రం, ఏదో తోపులాటలో గాయాలు అయ్యాయని చెప్పి, ఇప్పుడు ఎదురు మేమే దాడి చేసాం అని చెప్తున్నారని, ఈ వంకతో, మా ఆడవాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

police 06012020 3

మరో పక్క ఈ రోజు అమరావతిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ రోజు రాజధాని గ్రామాల్లో మహా పాదయత్రకు రైతులు సిద్ధం అవుతున్నారు. అయితే, ఈ పాదయత్రకు పర్మిషన్ లేదని పోలీసులు చెప్తున్నారు. ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ప్రజల రక్షణ కోసమే పోలీసులు ఉన్నారని, నిరసన తెలపటంలో తప్పు లేదు కాని, ఎదుటు వారికి ఇబ్బంది కలిగిస్తే, పోలీసులు చూస్తూ కూర్చోరని, అడిషనల్‌ ఎస్పీ చక్రవర్తి అన్నారు. అయ్తీ రైతులు మాత్రం, తుళ్లూరు నుండి మందడం వరకు ర్వాలి చేస్తామంటున్నారు. శాంతియుతంగా ర్వాలీ చేస్తుంటే అడ్డుకుంటే సహించేలేదంటున్నారు రైతులు. ఇప్పటి వరకు శాంతియుతంగానే చేసామని, ఇక ముందు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని, పోలీసులు సహకరించాలని కోరుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read