రాజధాని అమరావతి నుంచి తరలిస్తే, అక్కడ భూములు ఇచ్చిన తరువాత, ఇబ్బంది పడితే, సచివాలయ ఉద్యోగులు. ఎందుకంటే, వారు 2014 దాకా హైదరాబాద్ సచివయంలో పని చేసే వారు. రాష్ట్ర విభజన తరువాత, మనం ఇక్కడ రాజధాని ఏర్పాటు చేసుకోవటం, అలాగే సచివాలయం కట్టుకోవటంతో, 2017లో హైదరాబాద్ నుంచి సచివాలయ ఉద్యోగులు అందరూ ఇక్కడకు వచ్చారు. కొంత మంది మాత్రం, ప్రతి రోజు హైదరాబాద్ కు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. వీరి కోసం స్పెషల్ ట్రైన్ కూడా ఉంది. అదీ కాక, వారి కోరిక మేరకు, 5 రోజులు పని దినాలు కు చంద్రబాబు ఒప్పుకున్నారు. నెమ్మదిగా హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చి, ఇక్కడ ఇళ్ళు కొనుక్కుని, ఇక్కడ పిల్లలను స్కూల్స్ , కాలేజీల్లో చేర్పించి, సచివాలయ ఉద్యోగులు ఇక్కడ అలవాటు పడుతున్నారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో, వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నంకు సచివాలయం తరలిపోతుందని, జనవరి 20 నుంచే తరలింపు ప్రక్రియ మొదలు అవుతుందని, నిన్న ప్రభుత్వ వర్గాల నుంచి లీకులు వచ్చాయి.
విడతల వారీగా, విశాఖకు సచివాలయం తరలింపు ఉంటుందని చెప్పారు. అయితే ఈ వార్తలతో, సచివాలయం ఉద్యోగులు అలెర్ట్ అయ్యారు. ఇన్నాళ్ళు సచివాలయ ఉద్యోగులు ఎందుకు ఆందోళన చెయ్యటం లేదు, వారికి విశాఖకు వెళ్ళటం ఇష్టమా, లేక ప్రభుత్వానికి భయపడి రావటం లేదా అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇదే విషయన్ని చంద్రబాబు కూడా అన్నారు. ఉద్యోగులు, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, పోరాడాలని అన్నారు. అయితే, నిన్న సచివాలయం తరలింపు పై లీకులు రావటంతో, ఈ రోజు సచివాలయ ఉద్యోగులు అత్యవసర సమావేశం అయ్యారు. ఉద్యోగులు పెద్ద ఎత్తున సెక్రటేరియట్ లో హాజరు అయ్యి, ఈ సచివాలయ తరలింపు పై చర్చించారు. వీరు కూడా అమరావతి తరలింపు పై మదన పడుతున్నట్టు తెలుస్తుంది.
సచివాలయంలో ఉద్యోగుల సమావేశం పై, ఉద్యొగుల సంఘం అధ్యక్షుడు వెంకట రామి రెడ్డి, మీడియాతో మాట్లాడారు. అమరావతి తరలింపు విషయమై, ఉగ్యోగులు కూడా తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారని అన్నారు. రెండేళ్ళ క్రితమే హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చామని, ఇప్పుడు మళ్ళీ విశాఖ అని ప్రభుత్వం చెప్పటంతో, తమకు ఏమి చెయ్యాలో తోచటం లేదని అన్నారు. ఇప్పటికే ఇక్కడ ఇళ్ళు కొనుక్కొని, ఈఎంఐలు కట్టుకుంటున్నామని, పిల్లలను ఇక్కడ స్కూల్స్ లో వేశామని, ఇక్కడ అంతా సెట్ అవుతున్నాం అనుకున్న టైంలో, ఈ వార్తతో తమకు ఏమి అర్ధం కావటం లేదని అన్నారు. ఈ విషయాలు అన్నిటి పై చర్చిస్తున్నామని, ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాగానే, ఏమి చెయ్యాలి అనే దాని పై అలోచించి, కార్యచరణ ప్రకటిస్తామని అన్నారు.