టిడిపి నేత, పంచుమర్తి అనురాధ, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. రైతులని పైడ్ ఆర్టిస్ట్ లు అంటున్న శ్రీదేవి, అమరావతిలో ఆందోళన చేస్తున్న ఎవరైనా పైడ్ ఆర్టిస్ట్ లు అనే వారు ఉన్నారని నిరూపిస్తే, ఎమ్మెల్యే శ్రీదేవి కాళ్లు మొక్కుతానాని, ఆమె నిరూపించాలని, అనురాధ అన్నారు. నిన్న మీడియాతో మాట్లాడిన, పంచుమార్తి అనురాధ ఇంకా ఏమన్నారంటే, "గత 13రోజుల నుండి రాజధాని రైతులు ఒక అనిస్థితికి గురి చేసిన వైసీపీ ప్రభుత్వం. రాజధాని రైతులకు ఏమి చేయలేని పరిస్థితిలో వారు వారి బాధలను చెప్పుకుంటే ఆ ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు వారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఉండవల్లి శ్రీదేవి, ఆళ్ల రామకృష్ణను రాజధాని ప్రాంత రైతులు ఓట్లు వేసి గెలిపిస్తే దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఉండవల్లి శ్రీదేవి రైతులను పట్టుకొని పెయిడ్ ఆర్టిస్టులని మాట్లాడుతున్నారు. మీరు గెలిపే ఒక అనిస్థితిలో ఉంది. దళితులకు ఎమ్మెల్యే సీటు రాకుండా చేసిన మీరు రైతుల గురించి మాట్లాడుతారా? కలెక్టర్ స్వయంగా పిలిచి మీ గెలుపుపై వివరణ కోరడం జరిగింది. మీరు అక్కడ ఎస్సీ ఎమ్మెల్యే అవునా? కాదా? అనే విషయం ఆగమగోషరంగా ఉన్న ఈ పరిస్థితుల్లో మీరు రైతుల గురించి ఏ రకంగా మాట్లాడుతారు? మీ గెలుపు కృషి చేసిన రాయపూడి సొసైటీ ఛైర్మన్ ఈ రోజు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబునాయుడు అమరావతి వచ్చిన సమయంలో వైసీపీ కార్యకర్తలే స్వయంగా వైసీపీకి ఓటు వేసినందుకు మేము సిగ్గు పడుతున్నామని చెప్పిన మాట వాస్తవం కాదా? మాకు పార్టీలు లేవు మాకు రైతు పార్టీ ఒకటే అని చెప్పి మాట వాస్తవం కాదా?"
"జగన్మోహన్‌రెడ్డి సెక్రటేరియట్‌కు వెళ్లాడానికి కాన్వాయ్‌ని ట్రైల్‌రన్ వేసిన పరిస్థితి అందరికి తెలుసు. నక్సల్స్ ప్రాంతంలో ట్రెల్‌రన్ వేస్తారు. కానీ రైతుల నుంచి పోవడానికి ట్రైల్‌రన్ వేయించుకున్న ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్‌రెడ్డి మాత్రమే. రాజధాని ప్రాంతం రైతుల కోసం ఉండవల్లి శ్రీదేవి జగన్మోహన్‌రెడ్డితో పోరాటం చేయాలి..అవసరమైతే రాజీనామా చేయాలి. ఆళ్ల రామకృష్ణరెడ్డి 2014నుంచి 2019 వరకు ప్రజలను పట్టించుకోకుండా 365 రోజుల సరిపడా 365కేసులు వేశారు. రాజధాని రాకుండా ఆళ్లరామకృష్ణరెడ్డి ఎన్ని కేసులు వేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఫిరంగిపురం గెస్ట్‌హౌస్‌లో మీరు చేసే అనైతిక కార్యక్రమాల గురించి గుస..గుసలాడుతున్నారు. ఫోన్‌లు మాట్లాడుకుంటూ.. నియోజకవర్గ రైతులను, నేప్రజలను గాలికి వదలివేసిన చరిత్ర ఆళ్ల రామకృష్ణరెడ్డిది. టోల్‌గేటు దగ్గర కట్టిన బిల్డింగ్ కట్టిన వ్యక్తుల నుంచి ఎన్ని కోట్టు దోచుకున్నారో మీ కార్యకర్తలే చెబుతున్నారు. మీ నియోజకవర్గ ప్రజలను మీరే పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. అలాంటప్పుడు మీరు ఎమ్మెల్యేగా రాజనామా చేయాలి. మీకు దమ్ముంటే మీరు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి."
"సెక్యూరిటీ సహయంతో జగన్మోహన్‌రెడ్డి క్యాంపు ఆఫీస్ వెళ్ళీ నాలుగు మాటలు మాట్లాడి తిరిగి ఇంటిలో దాగుకుంటున్నారు. అంటే పెయిడ్ అర్టిస్టులు మీరా?..రైతులా? రైతులను ఆరెస్టు చేసిన వారు భయపడకుండా ధర్నాలు చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ధర్మాణ ప్రసాద్ మాట్లాడుతూ 7 గ్రామాలు వచ్చి ధర్నాలు చేస్తే మేము సమాధానం చెప్పాలని అవమానకరంగా మాట్లాడారు. గ్రానైట్ కొండల కోసం, గ్రానైట్ తవ్వకాల కోసం, అక్కడ ఉన్న మీ భూములకు రేట్లు పెంచడం కోసం రైతులను మోసం చేసే పరిస్థితి మొదలు పెట్టారు. రైతులు అయితే మంచి మాటలు మాట్లాడాకుండాదా?..రైతులు అయితే మంచి దుస్తులు వేసుకోకుండాదా? కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వచ్చి మీ కాళ్లు పట్టుకుంటే వారు మీ దృష్టిలో రైతులా? రైతులను ఇంత దారుణంగా మాట్లాడితే బోత్సకు ఏమి వస్తుంది. గత ఏడు నెలల నుంచి మంత్రి బోత్స సత్యనారాయణ వచ్చి.. రానీ భాషతో నత్తి భాషతో రాజధాని ప్రాంతం రైతులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. పిచ్చి..పిచ్చిగా మాట్లాడినా..రైతులను పదే..పదే పెయిడ్ ఆర్టిస్టులని మాట్లాడినా మర్యాద దక్కాదు." అని పంచుమర్తి అనురాధ అన్నారు.