ఆరు నెలల్లోనే భ్రమాస్త్రం వదిలాం, ఇక చంద్రబాబు పరిస్థితి అయిపొయింది, తెలంగాణాలో లాగా, ఎటూ కాకుండా పోతాడు, టిడిపి పార్టీ ఇక నామమాత్రమే అంటూ, మూడు రాజధానుల ప్రకటన రాగానే, వైసీపీ పార్టీలోనే కాదు, సామాన్య ప్రజల్లో కూడా ఉన్న అభిప్రాయం ఇది. చంద్రబాబు ఇప్పుడు కనుక మూడు రాజధానుల ప్రకటన స్వాగితిస్తే, అమరావతి రైతులని ముంచేస్తున్నాడు అంటూ, ప్రచారం చెయ్యొచ్చు, అప్పుడు కోస్తాలో దెబ్బ పడుతుంది. ఒక వేళ అమరావతికి సపోర్ట్ గా మాట్లాడితే, చంద్రబాబు రాయలసీమ ద్రోహి, ఉత్తరాంధ్ర ద్రోహి అని ప్రచారం చెయ్యొచ్చు. చంద్రబాబు ఏ స్టాండ్ తీసుకున్నా, చంద్రబాబుని, ఒక రెండు మూడు జిల్లాలకు పరిమితం చెయ్యొచ్చు అని ప్లాన్ వేసారు జగన్ అండ్ టీం. అయితే, ఆ ప్రకటన చేసి ఇప్పటికీ, 13 రోజులు అయ్యింది, అయినా జగన్ తలుచుకున్న దాంట్లో, కొంచెం కూడా టిడిపికి డ్యామేజ్ కాక పోగా, ఇటు వైసీపీకే ఇబ్బంది వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీని అంతటికీ కారణం, సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులు అని జగన్ భావిస్తున్నారు.
చంద్రబాబుని ఫిక్స్ చేసే విధంగా, ఆయా ప్రాంతాల వైసీపీ నేతలు, ప్రజల్లోకి తీసుకు వెళ్ళలేక పోయారని, జగన్ భావిస్తున్నారు. చివరకు విశాఖపట్నమే ఏపి రాజధాని అనే భావన కల్పించినా, ఎందుకో కాని విశాఖ ప్రజల్లో ఆ ఊపు కనిపించటం లేదు. విశాఖపట్నం ప్రజల్లో ఎందుకో కాని, సంతోషం కంటే, భయమే ఎక్కువ కనిపించింది. విశాఖలో పర్యటించిన జగన్ కూడా, ఎందుకో నిరాశగా కనిపించారు. చివరకు ఏమి ప్రసంగించకుండానే పర్యటన ముగించుకుని వెళ్ళిపోయారు. విశాఖ ప్రజల్లో ఈ నిర్లిప్తత ఎందుకు వచ్చిందో, ఇప్పటికీ వైసీపీకి అర్ధం కవటం లేదు. వన్ సైడ్ గా విశాఖలో ప్రజలు తమకు మద్దతు ఉంటారు అనుకుంటే, ఇలా అయ్యింది ఏమిటి అంటూ, వైసీపీలో అంతర్మదనం కొనసాగుతుంది.
ఇక రాయలసీమ ప్రజలు కూడా, హైకోర్ట్ తో పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు అనే భావనలో ఉన్నారు. అదీ కాక, సెక్రటేరియట్ కు వెళ్ళాలి అంటే, విశాఖకు వెళ్ళాలి అంటే 19 గంటలు పడుతుంది, ఇవన్నీ ఎలా సాధ్యం, అసలు వెనుకబడింది, రాయలసీమ కాబట్టి, రాజధాని మొత్తాన్ని రాయలసీలో పెట్టాలని, అప్పుడే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది అంటూ డిమాండ్ చేస్తున్నారు. అటు వైజాగ్ లో కాని, ఇటు కర్నూల్ లో కాని, ఎక్కడా ప్రజలు స్వచ్చందంగా వైసీపీకి మద్దతు తెలపక పోగా, ప్రతి రోజు అమరావతి రైతుల ఆందోళన మాత్రం రాష్ట్రం అంతా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే వైసీపీలో అంతర్మదనం సాగుతుంది. ఈ పరిస్థితిని తమకు ఎలా అనుకూలంగా మలుచుకోవాలి అనే ఆలోచనతోనే, మొన్న క్యాబినెట్ లో అధికారిక ప్రకటన చెయ్యకుండా వాయిదా వేసారని తెలుస్తుంది.