రాజధాని అమరావతిగా కాకుండా, ముదుర్ రాజధానులు చేస్తాం, సెక్రటేరియట్ వైజాగ్ లో పెడతాం, కర్నూల్ లో హైకోర్ట్ పెడతాం, అమరావతిలో కేవలం అసెంబ్లీ మాత్రమే ఉంటుంది అంటూ, ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీని కోసం, జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ, హై పవర్ కమిటీ అంటు ప్రభుత్వం మూడు కమిటీలు వేసింది. అయితే, ప్రభుత్వం తెసుకున్న ఈ నిర్ణయం పై, రాజధాని రైతులు హైకోర్ట్ కు వెళ్లారు. అసలు జీఎన్ రావు కమిటీకి చట్టబద్దత లేదని వాదనలు వినిపించారు. అలాగే బోస్టన్ కమిటీ పై కూడా హైకోర్ట్ ద్రుష్టికి తీసుకు వచ్చారు. నిజానికి, జీఎన్ రావు కమిటీకి, అలాగే హై పవర్ కమిటీకి ఉత్తర్వులు ఉన్నాయని కాని, బోస్టన్ కమిటీకి మాత్రం, ఎక్కడా ఉత్తర్వులు లేవు. ఎక్కడా ఈ కమిటీ పై వార్తలు కూడా రాలేదు. ఒక ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ గ్రూప్‌ కు, ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినప్పుడు, జీవో కాని, ఉత్తర్వులు కాని ఉంటాయి. అలాంటిది ఏమి లేదు అంటూ, రాజధాని రైతులు హైకోర్ట్ కు తెలిపారు.

highcourt 31112019 2

నిన్న ఈ పిటీషన్ పై, హైకోర్ట్ లో వాదనలు జరిగాయి. దీని పై స్పందించిన హైకోర్ట్, జీఎన్‌ రావు, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ నివేదికలను తమ ముందు పెట్టాలి అంటూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించి ఉత్తర్వులు ఏమిటి, అవి తమ ముందు ఉంచండి అంటూ హైకోర్ట్ ఆదేశించింది. దీని పై స్పందించిన ప్రభుత్వ లాయర్, ఆ వివరాలు తమ దగ్గర లేవని, వచ్చే వాయిదా నాటికి, పూర్తీ వివరాలతో వస్తామని చెప్పారు. దీని పై స్పందించిన హైకోర్ట్, పిటిషనర్‌ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ల పై జనవరి 21లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని పై తదుపరి విచారణను 23కు వాయిదా వేసింది.

highcourt 31112019 3

ప్రభుత్వం కూడా కౌంటర్ అఫిడవిట్ ఇచ్చిన తరువాత, తాము పరిశీలించి చెప్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.వెంకటరమణతో కూడిన ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం తాము ఏ నిర్ణయం ప్రకటించలేమని పెర్కుంది. ప్రభుత్వాన్ని అమరావతిలో నిర్మాణాలు కొనసాగించేలా ఆదేశించాలని, జీఎన్‌ రావు కమిటీ నివేదికను అమలు చేయకుండా ఆదేశించాలని, అనుబంధ వ్యాజ్యం వేశారు. అయితే ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసేంతవరకు వేచి చూద్దామని పిటిషనర్‌తో ధర్మాసనం పేర్కొంది. మరో పక్క, కొంత మంది నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలకు చెందిన వారు, జీఎన్‌రావు కమిటీ సిఫార్సులను సమర్థిస్తూ ఇంప్లీడ్‌ పిటిషన్లు వేశారు. మొత్తానికి ఈ కేసు జనవరి 23 కు వాయిదా పడింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read