మొన్నటి దాకా, అమరావతి, పోలవరం రెండు కళ్ళుగా పరిపాలన సాగేది. అమరావతి పూర్తయితే, రాష్ట్రానికి సరిపడా ఆదాయం, ఈ నగరం నుంచే వచ్చేలా ప్రణాలికలు రూపొందించారు. అలాగే పోలవరం పూర్తయితే, రాష్ట్రంలో ప్రతి భూమిలో నీరు పారించే అవకాసం వచ్చేది. అయితే ప్రభుత్వాలు మారటంతో, ప్రయారిటీలు మారాయి. ఇప్పటి ప్రభుత్వం అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేసింది, అయితే పోలవరం పై మాత్రం, పక్కన పెడుతున్నాం అని చెప్పకపోయినా, మా ప్రాధాన్యం పోలవరం అని చెప్తున్నా, పనులు మాత్రం జరగటం లేదు. చంద్రబాబు ఉండగా, ప్రతి సోమవారం పోలవరం పై సమీక్షలు చేసే వారు. 18 శాతం నుంచి 73 శాతానికి తీసుకు వెళ్లారు. అసలు పోలవరం పూర్తి అవుతుందా అనే దగ్గర నుంచి, పోలవరం పునాదులు దాటి, 73 శాతానికి చేరుకుంది. అయితే, దాన్ని రివర్స్ టెండరింగ్ పేరుతొ బ్రేకులు వేసారు. చంద్రబాబు పోలవరంలో నవయుగతో కలిసి, అవినీతి చేసారని, అందుకే నవయుగని తప్పించి, రివర్స్ టెండరింగ్ పేరుతో, కొత్త టెండర్ వేసి, మేఘా కంపెనీకి అప్పచెప్పారు.

polavaram 31122019 2

గత ఆరు నెలలుగా పనులు ఏమి చెయ్యలేదు. వరదలు సాకుగా చెప్పారు. నవంబర్ 1 నుంచి, పనులు పరిగెత్తిస్తున్నాం అన్నారు. అయితే, పనులు మాత్రం ఏ మాత్రం ముందుకు వెళ్ళలేదు. ఐదు వారాల్లో 3000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ మాత్రమే వేశారు. గతంలో చంద్రబాబు ఉండగా, 24 గంటల్లో 32000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు. అంటే అప్పట్లో మూడు గంటల్లో చేసిన పని ఇప్పుడు 5 వారాల్లో చేశారు అన్నమాట. పోలవరం పనులు ఎంత మందగమనంలో సాగుతున్నాయి అని చెప్పటానికి ఇదే ఉదాహరణ. అయితే ఇదే సమయంలో, నిన్న కేంద్ర జలసంఘం సభ్యుడు ఎస్‌.కే.హాల్దర్‌ నేతృత్వంలోని కమిటీ పోలవరం సందర్శించింది. అక్కడ అధికారులతో సమావేశం అయ్యి, పోలవరంలో జరుగతున్న పనులు పై ఆరా తీసింది.

polavaram 31122019 3

అయితే పనులు జరుగుతున్న తీరు పై, కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మీరు కోరినట్టే రివర్స్ టెండరింగ్ కు వెళ్లారు, అయినా పనులు ఇలా నత్తనడకన ఎందుకు సాగుతున్నయి అంటూ ప్రశ్నించారు. లక్ష్యం ఘనంగా ఉందని, ప్రగతి మాత్రం, ఏ మాత్రం ముందుకు వెళ్ళటం లేదని, కేంద్రం అభిప్రాయ పడింది. ప్రాజెక్టు డిజైన్లు, ప్రణాళికపై చర్చించేందుకు వచ్చేవారం ఢిల్లీలో సమావేశమవుదామని వెల్లడించింది. అయితే ఇదే సందర్భంలో రాష్ట్ర అధికారులు నిధులు గురించి ప్రస్తావించగా, అవి తమకు సంబంధం లేదని, మేము కేవలం జెక్టు డిజైన్లు, ప్రణాళిక పై మాత్రమే మేము చెప్పగలమని అన్నారు. అలాగే పోలవరం పై, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన, నిపుణుల కమిటీ వెల్లడించిన అభిప్రాయాలతో తమకెలాంటి సంబంధమూలేదని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read