అమరావతిని నిర్వీర్యం చేస్తూ, విశాఖపట్నంకు సెక్రటేరియట్ ను తరలిస్తున్నారు అంటూ, గత 13 రోజులుగా అమరావతి రాజధాని రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు, వారి వద్దకు ఒక్క మంత్రి కాని, ప్రభుత్వం తరుపు నుంచి ఒక్క అధికారి కాని వచ్చి, రాజధాని రైతులతో మాట్లాడ లేదు సరికదా, కనీసం వారిని పట్టించుకొను కూడా పట్టించుకోవటం లేదు. అయితే మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లోనే, మూడు రాజధానుల పై నిర్ణయం అధికారికంగా జరిగిపోతుంది అని అందరూ అనుకున్నారు. అయితే, ఏమైందో ఏమో కాని, రాత్రికి రాత్రి నిర్ణయం మారిపోయింది. భారీ పోలీస్ బందోబస్తు, అలాగే విశాఖలో జగన్ కు భారీ ఏర్పాట్లు చూసి, ఇక ప్రకటన లాంఛనమే అని అందరూ అనుకున్నారు. అయితే ఎవరి ఒత్టిడో కాని, రాజధాని నిర్ణయం అయితే వాయిదా పడింది. అయితే ఇప్పుడు రాజధానికి సంబందించి మరో నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. నిన్న ఆదివారం అయినా సరే, ఒక హై పవర్ కమిటీని నియమిస్తూ, జీవో జారీ చేసింది.
ఈ కమిటీలోని సభ్యులు అందరూ జగన్ మాట వినే వారే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ కమిటీలో జగన్ సహచర మంత్రులు అయిన, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేశ్, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, మంత్రి పేర్ని నాని ఉన్నారు. అయితే ఇదే కమిటీలో డీజీపీ గౌతం సవాంగ్ ని కూడా పెట్టటం పై అందరూ ఆశ్చర్య పోయారు. సహజంగా ఇలాంటి కమిటీల్లో ఐఏఎస్ అధికారులను పెడతారు. అలాగే ఈ కమిటీలో కూడా ఒకరిద్దరు ఉన్నారు, సొంత పార్టీ మంత్రులు ఉన్నారు, మరి రాజధానిని డిసైడ్ చేసే కమిటీలో డీజీపీ ఎందుకు ఉన్నారు అనే సందేహం వ్యక్తం అవుతుంది.
అయితే విశాఖపట్నంను రాజధాని చెయ్యటం పై, కొంత మండి సీనియర్ పోలీస్ అధికారులలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని తెలుస్తుంది. విశాఖ జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నాయని, ఒరిస్సా బోర్డర్ లో, మావోయిస్టులకు బలమైన పట్టు ఉందని, పోయిన ఏడాది, ఏకంగా ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమాను నక్సల్స్ హత్య చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అలాగే విశాఖ తీరం పై, పాకిస్తాన్ గురి పెట్టిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. అయితే, ఈ సీనియర్ పోలేస్ అధికారులకు సమాధానంగానే, డీజీపీని కమిటీలో పెట్టారని, పోలీసు బాస్‌గా విశాఖ రాజధానికి అనువైన ప్రాంతమని ఆయన చెబితే, ఇక పోలీస్ డిపార్టుమెంటు నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండవని, ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తుంది. ఏ వైపు నుంచి ఇబ్బంది, అసంతృప్తి లేకుండా, ప్రభుత్వం అలోచించి నిర్ణయం తీసుకుంటుందని చెప్తున్నారు.