మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో సిబిఐ రైడ్లు చెయ్యగానే, ఆ నేతలు, పార్టీ మారటం, చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నేతలను సిబిఐ, ఇన్కమ్ టాక్స్ ఎలా టార్గెట్ చేసిందో చూసాం. తరువాత, ఎన్నికలు అయిన తరువాత, కొంత మంది టిడిపి నేతలు బీజేపీలోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా, గుంటూరు జిల్లా టిడిపి నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు పై, సిబిఐ రైడ్లు జరిగాయి. రాయపాటి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకు డైరెక్టర్ గా ఉన్న సంగతి తెలిసిందే. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి హయంలో, ఆయన కంపెనీ అయిన ట్రాన్స్ ట్రాయ్ కు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారు. అయితే ఆ తరువాత వచ్చిన చంద్రబాబు, ఈ కంపెనీ పోలవరం ప్రాజెక్ట్ పనులు సరిగ్గా చెయ్యలేక పోతుందని గ్రహించారు. మళ్ళీ టెండర్ రద్దు చేసి, కొత్త టెండర్ పిలిస్తే, న్యాయ పరమైన చిక్కులు వస్తాయని గ్రహించి, పోలవరం ప్రాజెక్ట్ ను సబ్ కాంట్రాక్టు కింద నవయుగని తీసుకోవచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ పై, సిబిఐ దాడులు జరగటం సంచలనంగా మారింది.

rayapati 02012020 2

ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ పై ఇది వరకే సిబిఐ దాడులు చేసి, కేసు పెట్టింది. ఇప్పుడు ఆ కంపెనీ ప్రమోటర్, రాయపాటి పై కూడా సిబిఐ దాడులు చేసి, ఆయన పై కూడా నిన్న కేసు బుక్ చేసారు. అయితే, ఈ రోజు తిరుమల దర్శనానికి వచ్చిన రాయపాటి, సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతానికి తాను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయని, ఇప్పటికైతే పార్టీ మారే ఆలోచనదే లేదని అన్నారు. అయితే భవిష్యత్తులో పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని, తన అనుచరుల అభీష్టం మేరకు, పార్టీ మారే అవకాశాన్ని తీసి పారేయలేమని రాయపాటి అంటున్నారు. తన ఇంటి పై జరిగిన సిబిఐ సోదాలు గురించి మాట్లాడుతూ, సిబిఐ సోదాలకు వచ్చిన సమయంలో, తాను ఊరిలో లేనాని చెప్పారు. అయితే తనిఖీల తరువాత, ఏమి లభించలేదని, వారే చెప్పారని అన్నారు.

rayapati 02012020 3

సిబిఐ పెట్టిన కేసుతో తనకు సంబంధం లేదని అన్నారు. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రోజు వారీ వ్యవహారాలతో, తనకుగానీ, తన కుటుంబీకులకు గానీ ప్రమేయం లేదని అన్నారు. త్వరలోనే సిబిఐకి అన్నీ తెలుస్తాయని రాయపాటి అన్నారు. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీని నెలకొల్పింది తానె అని, అయితే, రాజకీయాల్లోకి వచ్చిన తరువాత, కంపెనీ రోజు వారీ కార్యక్రమాల గురించి పెద్దగా పట్టించుకోవటం లేదని అన్నారు. ఎండీ శ్రీధర్, సీఈవోలే మొత్తం కంపెనీ వ్యవహారాల్ని చూసుకుంటారని రాయపాటి అన్నారు. తన భార్య గతంలో ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి డైరెక్ట్ గా ఉండేవారని, ఆమె చనిపోయిన తర్వాత బ్యాలెన్స్ షీట్ పై సంతకాలు పెట్టాలి కాబట్టి, నామమాత్రంగా డైరెక్ట్ అయ్యానని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read