సహజంగా ప్రభుత్వాలు సేవలకు చార్జీలు వసూలు చేస్తాయి కాని, వ్యాపారం చెయ్యవు. ఉదాహరణకు, మనకు ఏమైనా సర్టిఫికేట్ కావాలి అంటే, లేదా లైసెన్స్ కావాలి అంటే, దానికి కొంత నామమాత్రపు ఫీజు వసూలు చేస్తాయి. అయితే ఆర్టీసీలాగా, లాభాల కోసం, టికెట్ రేటు పెంచటం లాంటి వ్యాపారాలు చెయ్యవు. ఇవి చివరకు ప్రజల పైనే భారం పడతాయి. అందుకే ఇలాంటివి అన్నీ కార్పొరేషన్ లు పెట్టి నడిపించటం చేస్తారు. కేసీఆర్ లాంటి వారు కూడా, ధనిక రాష్ట్రం అయినా, ఎంత ఒత్తిడి వచ్చినా, విలీనం చెయ్యనిది అందుకే. కావాలంటే, సంస్థ నిలబడటానికి, ప్రభుత్వాలు సహాయం చేస్తాయి కాని, విలీనం చేసుకుని, ఆ తెల్ల ఏనుగుని మోయ్యవు. అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటున్నాం అని చెప్పింది. ఆర్టీసీ విలీనం అనేది ఎలాగూ కుదరదు కాబట్టి, ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసుకుంటున్నామని చెప్పారు. ఆ దిశగా కార్యాచరణ చేసి, జనవరి ఒకటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేసుకున్నారు.

rc 02012020 2

అంటే ఇక నుంచి వారు ప్రభుత్వ ఉద్యోగులు. ఇంకేముంది, ఆర్టీసీ ఉద్యోగులు తమకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని సంతోషించారు. ప్రభుత్వ అధికారులతో సమానంగా జీతాలు, పెన్షన్లు వస్తాయని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఉద్యోగాల్లో మదనం మొదలైంది. ఆర్టీసీ పేరు ప్రజా రవాణా శాఖగా మారటం తప్ప, తమకు ఒరిగింది ఏమి లేదని చెప్తున్నారు. విషయం తెలుసుకున్న తరువాత, ఎవరికీ సంతోషం కనిపించటం లేదు. రిటైర్మెంట్ తరువాత వచ్చే పెన్షన్ పెరుగుతుందని ఆశ పడ్డామని, అయితే ఆ పెన్షన్ ఉండదని తెలుసుకుని, ఈ విలీనం వల్ల ఎలాంటి ఉపయోగం మాకు లేదని అంటున్నారు. ఇప్పుడు మా పెన్షన్ కంటే, ప్రభుత్వం ఇచ్చే వృధాప్య పెన్షన్ ఎక్కువ వస్తుందని, ప్రభుత్వంలో విలీనం అయిన తరువాత, పెన్షన్ ఎక్కువ వస్తుందని ఆశ పడ్డామని అంటున్నారు.

rc 02012020 3

ప్రభుత్వ ఉద్యొగులతో సమానంగా అన్నీ వర్తింప చేస్తామని మాకు చెప్పారని, ప్రభుత్వం మాత్రం, పెన్షన్ విధానం పై ఏ హామీ ఇవ్వకుండా, మా పాత పెన్షన్ అమలు అవుతుందని చెప్పారని అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్నీ వర్తింపజేయాలని, పాత పెన్షన్‌ అమలు చేయాలని ఈయూ, ఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ సహా అన్ని కార్మిక సంఘాలు, సూపర్‌ వైజర్ల అసోసియేషన్లు కోరాయి. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం పై ఇచ్చిన నివేదిక బయట పెట్టలేదని, అసలు రహస్య నివేదికతో అంతా అయోమయంగా ఉందని, ఈ విలీనం వల్ల తమకు ఒరిగింది ఏమిటో అర్ధం కావటం లేదని అంటున్నారు. ఇవే కాక, ఇంకా మాకు చాలా విషయాల పై క్లారిటీ లేదని, తమకు ఎవరూ సమాధానం చెప్పటం లేదని, సిబ్బంది వాపోతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read