గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచు కోట లాంటిది. గతంలో దాసరి బాలవర్ధాన్ రావు కానీ, మొన్న ఇంత గాలిలో కూడా వంశీ గెలిచాడు అంటే, టిడిపి క్యాడరే కారణం. వంశీకి మాస్ ఇమేజ్ ఉన్నా, పార్టీ మార్పుతో, తన వెంట పెద్దగా టిడిపి క్యాడర్ వెళ్ళే అవకాసం లేదు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం తరుపున గెలిచిన వంశీ, కొన్ని రోజులుకే తెలుగుదేశం పార్టీతో విభేదించారు. ముందుగా తన పై కేసు పెట్టటంతో, వైసీపీ పై విమర్శలు చేసిన వంశీ, తరువాత కాలంలో జగన్ ను కలిసి, చంద్రబాబుని తిట్టటం మొదలు పెట్టరు. దీంతో తెలుగుదేశం పార్టీ, వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేసి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అయితే వంశీ డైరెక్ట్ గా వైసీపీ పార్టీలో చేరక పోయినా, ఆయన వైసీపీలోకి వేల్లిపోయినట్టే లెక్క. అయితే ఇది జరిగి రెండు నెలలు అవుతున్నా, ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి గన్నవరం నియోజకవర్గంలో పెద్ద దిక్కు లేదు. ఒక వేళ ఎన్నికలు వస్తే, వంశీకి పోటీగా పక్కన నూజివీడు నియోజకవర్గంలో ఉన్న ముద్దరబోయిన కాని, గద్దె అనురాధని కాని దింపాలని అనుకున్నారు.
అయితే ఇప్పుడప్పుడే ఎన్నికలు జరిగే అవకాసం లేకపోవటంతో, గన్నవరం టిడిపి ఇంచార్జ్ గా ఎవరో ఒకరిని నియమించాలని, గన్నవరం టిడిపి క్యాడర్ నుంచి ఒత్తిడి వస్తుంది. ఈ నేపధ్యంలోనే, పార్టీ అధిష్టానం గన్నవరం ఇంచార్జ్ పై కసరత్తు ప్రారంభించింది. వంశీ ఇప్పుడు అధికార పార్టీలో ఉండటంతో, అతడి స్పీడ్ ని తట్టుకోగలిగే వారిని, ఆర్ధికంగా బలపడిన వారి కోసం, అదే విధంగా తెలుగుదేశం కార్యకర్తలతో మంచి సంబంధాలు ఉన్న వారి కోసం, టిడిపి అధిష్టానం అన్వేషిస్తుంది. గన్నవరం నియోజకవర్గంలో 1983 నుంచి 9 సార్లు ఎన్నికలు జరిగితే, టిడిపి ఆరు సార్లు గెలిచింది. ఈ నేపధ్యంలో, ఇక్కడ పట్టు తప్పకుండ, తొందరగా ఇంచార్జ్ ని నియమించాలని, తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తుంది.
ఈ నేపధ్యంలోనే, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్‌రావు సమీప బంధువు, పుట్టగుంట సతీశ్ ను గన్నవరం ఇంచార్జ్ ని చేస్తే ఎలా ఉంటుంది అనే దాని పై, అధిష్టానం ఫీడ్ బాక్ తీసుకుంటుంది. ఆయన గత కొన్నేళ్లుగా, పార్టీలో చురుగ్గా ఉంటున్నారు. 1994లో గద్దే రామ్మోహన్ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో, ఎన్నికల వ్యూహరచనలో సతీశ్ కీలకంగా వ్యవహరించారనే అభిప్రాయం ఉంది. ఇప్పటికే సతీస్ తో, విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జ్ బాధ్యతలు తీసుకోవడం పై చర్చించారు. తరువాత అధిష్టానం కూడా రంగలోకి దిగటంతో, తాను కుటుంబసభ్యులు, మిత్రులతో మాట్లాడి తన నిర్ణయం చెప్తానని, అధిష్టానానికి చెప్పినట్టు సమాచారం.