ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒక సీనియర్ అధికారి పై, ఇంతలా కక్ష ఎందుకు అంటూ, క్యాట్ ప్రశ్నించింది. అంతే కాదు, ప్రభుత్వ చర్యల పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే, ఐఆర్ఎస్ అధికారి, కృష్ణకిషోర్‌ ను ప్రభుత్వం సస్పెండ్ చేసిన వ్యవహారంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు పై క్యాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు కృష్ణకిషోర్‌ని ఎందుకు రిలీవ్‌ చేయలేదో చెప్పాలని, ఏపి ప్రభుత్వాన్ని క్యాట్ ప్రశ్నించింది. ఒక పక్క కేంద్రం ఆదేశాలు ఉన్నా, అవి ఎందుకు పట్టించుకోలేదొ సమాధానం చెప్పాలని క్యాట్‌ ప్రశ్నించింది. ఈ వ్యవహరం పై వెంటనే తమకు వివరణ ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని క్యాట్‌ ఆదేశించింది. 15 రోజుల క్రితం ఏపీఈడీబీ సీఈవోగా పని చేసిన కృష్ణకిషోర్‌‌ అవినీతి చేసారు అంటూ, ఏపి ప్రభుత్వం సస్పెన్షన్‌ చేసింది. ఆయన్ను సస్పెండ్ చేసి, ఎంక్వయిరీ చెయ్యాలి అంటూ, చీఫ్ సెక్రటరీ ఆదేశాలు ఇచ్చారు. ఆయన నిధుల దుర్వినియోగం చేసారు అంటూ, సీఐడీ కేసు నమోదు చేసారు.

velapaudi 24122019 2

అయితే, ప్రభుత్వం చేస్తున్న కక్ష పూరిత వ్యవహారం పై, కృష్ణ కిషోర్ క్యాట్ ను ఆశ్రయించారు. దీంతో, క్యాట్ ప్రభుత్వం పై సీరియస్ అయ్యింది. ఆయన సస్పెన్షన్ పై స్టే ఇచ్చింది. కేంద్ర ఆదేశాలు ఉన్నా, అవి ఎందుకు అమలు చెయ్యలేదు, అంటూ క్యాట్ సీరియస్ అయ్యింది. కృష్ణకిషోర్‌ని రిలీవ్‌ చెయ్యకుండా, ఏమి చేస్తున్నారు అంటూ ప్రభుత్వాన్ని క్యాట్ ప్రశ్నించింది. "ఏపీ ప్రభుత్వం పిచ్చిగా ప్రవర్తించింది. కృష్ణ కిషోర్‌ సస్పెన్షన్‌లో నిబంధనలు పాటించలేదు. కృష్ణ కిషోర్‌ సస్పెన్షన్‌ అసమంజసం. రాష్ట్ర ప్రభుత్వం తన శక్తియుక్తులను అభివృద్ధికి వినియోగించాలి. కృష్ణ కిషోర్‌కి పెండింగ్‌లో ఉన్న జీతం వెంటనే చెల్లించాలి" అని ప్రభుత్వానికి క్యాట్‌ ఆదేశాలు జారీ చేసింది.

velapaudi 24122019 3

అలాగే కృష్ణ కిషోర్‌కి పెండింగ్‌లో ఉన్న జీతం కూడా, ప్రభుత్వం వెంటనే చెల్లించాలని క్యాట్ తన ఆదేశాల్లో పేర్కొంది. ఒక సీనియర్ అధికారి విషయంలో ప్రభుత్వం ఇంతగా వ్యవహరించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది. అలాగే కృష్ణ కిషోర్ సస్పెన్షన్ పై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను, వచ్చే నెల 31వరకు స్టే ఇస్తూ, ఉత్తర్వులు పొడిగించింది. చంద్రబాబు హయంలో, కృష్ణ కిషోర్ డిప్యుటేషన్ పై వచ్చారు. ఏపీఈడీబీకి సీఈఓగా పని చేస్తూ, అనేక కంపెనీలతో పెట్టుబడుల పై అవగాహనా కార్యక్రమాలు చేసే వారు. అసలు ఈ శాఖకు బడ్జెట్ కూడా ఉండదు. అయితే, ఆయన గతంలో ఐటి డిపార్టుమెంటులో పని చేసే సమయంలో, జగన్ అక్రమ ఆస్తుల కేసు విషయంలో, జగతిలో వచ్చిన అక్రమ పెట్టుబడులు బయటకు తీసిన వ్యక్తిగా పేరు ఉంది. ఇప్పుడు జగన్ రాగానే, ఆయన పై అభియోగాలు మోపి, సస్పెండ్ చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read