ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోర్ట్ లలో, ట్రిబ్యునల్ ల్లో, వరుస షాకులు తగులుతున్నాయి. మొన్నే ప్రభుత్వం అన్ని ప్రభుత్వ భవనాలకు వేస్తున్న రంగుల పై, హైకోర్ట్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు క్యాట్ వంతు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం క్యాట్ ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు రోజుల క్రిందట, డెప్యుటేషన్ లో వున్న కేంద్ర ఐఏఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ ని, సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం పై, జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్‍పై క్యాట్ స్టే విధించింది. కృష్ణకిషోర్ తన సస్పెన్ష న్‍పై క్యాట్‍ను ఆశ్రయించారు. దీంతో క్యాట్ ఏపి నిర్ణయం పై స్టే విధించింది. అయితే ఇది అతి పెద్ద నైతిక విషయంగా చెప్పాలి. ఏపి ప్రభుత్వ అవినీతి వాదనను క్యాట్ పట్టించుకోలేదు అనే చెప్పాలి. అందుకే ఇది ఏపి ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా చెప్తున్నారు. అయితే, ఇప్పుడు కృష్ణకిషోర్, తన మాతృ సంస్థ అయిన కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయే అవకాసం ఉంది.
అయితే అనూహ్యంగా ఆదివారం ఆదివారం రాత్రి 10 గంటలకు కృష్ణకిషోర్ పై సీఐడీ కేసు నమోదు చేసింది. రాత్రి 9.30కి కృష్ణకిషోర్ పై, ఇంతకు ముందు ఆయన సిఈఓ గా పనిచేసిన ఏపీఈడీబీ కి చెందిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ తులసిరాణి, కృష్ణకిషోర్ మీద అధికారికంగా ఫిర్యాదు చేసారు. రాత్రి 11 గంటలకు ఎఫ్‍ఐఆర్‍ను కోర్టుకు పంపినట్లు సీఐడీ పేర్కొంది. అయితే అంత రాత్రి పూట, అది కూడా ఆదివారం పూట, సీఐడీ కేసు నమోదు చేయడంపై క్యాట్ అధికారులు విస్మయం వ్యక్తం చేసారు. అంత తొందరగా ఈ పని చెయ్యాల్సిన అవసరం ఏమి వచ్చింది అంటూ ప్రశ్నించారు. వాదనలు విని స్టే విధించారు. ఆయన సస్పెన్షన్ మీద స్టే విధించారు కాబట్టి , ఆయన మీద సిఐడీ పెట్టిన కేసులు కూడా ప్రస్తుతానికి అబెయన్స్ లో ఉంటాయని తెలుస్తోంది.
ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్ళే అవకాసం లేకుండా, ఆయన పై సిఐడి, ఏసీబీ కేసులు పెట్టి, ఆరు నెలల పాటు విచారణ చేసి, ఆరు నెలలు ఏమి చెయ్యనివ్వకుండా, నిలువరిద్దామని ఏపి ప్రభుత్వ పెద్దలు అనుకున్నారు. అయితే, ఆదివారం హడావిడిగా ఎందుకు చెయ్యాల్సి వచ్చింది, అంత నేరాలు ఈయన చేసారా అనే చర్చ ఐఏఎస్ వర్గాల్లో జరుగుతుంది. కృష్ణ కిషోర్ సస్పెన్షన్ పై చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికారులను కావాలని ఇబ్బంది పెడుతున్నారని, అసలు బడ్జెట్ లేని శాఖలో, అవినీతి ఏమి ఉంటుందని, వాళ్ళు చేసేది కేవలం ప్రమోషన్ మాత్రమే అని, చెప్పారు. దీని పై అసెంబ్లీలో నిలదీస్తాం అని, ప్రభుత్వం పారిపోతుందని అన్నారు. అయితే, ఇప్పుడు క్యాట్ ఏపి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వటంతో, ఇప్పుడు ఏపి ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి.