Sidebar

11
Sun, May

నిన్న అమరావతి పై అసెంబ్లీలో జరిగిన చర్చలో, అధికారం పక్షం వైసీపీ, తెలుగుదేశం పార్టీ పై అనేక ఆరోపణలు చేసింది. ముఖ్యంగా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ పై, చంద్రబాబు పై అనేక ఆరోపణలు చేసారు. అమరావతిలో ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరిగిందని, మొత్తం స్కాం అంతా చంద్రబాబు చేసారని అన్నారు. అమరావతి ప్రకటన కంటే ముందే చంద్రబాబు అమరావతిలో రాజధాని వస్తుందని, తన అనుచరులకు చెప్పారని, తన బినామీల చేత, అమరావతిలో మొత్తం భూములు కొనుగోలు చేపించారు అంటూ ఆరోపణలు చేసారు. దీనికి సంబంధించి ఎన్నో పేర్లు చదివి వినిపించారు. అయితే, దీని పై విచారణ చేసి, వారిని లోపల వెయ్యండి అంటే మాత్రం, ఏడు నెలల నుంచి మాట్లాడటం లేదు. అయితే ఇది ఇలా ఉంటే, ఈ చర్చలో భాగంగా బుగ్గన, చంద్రబాబు కుటుంబానికి చెందిన ‘హెరిటేజ్‌ ఫుడ్స్‌’పై కూడా ఆరోపణలు చేసారు. ‘హెరిటేజ్‌ ఫుడ్స్‌’ కూడా అమరావతిలో భూములు కొంది అంటూ చెప్పుకొచ్చారు.

herigate 18122019 2

అయితే బుగ్గన వ్యాఖ్యల పై, ‘హెరిటేజ్‌ ఫుడ్స్‌’ నాలుగు పేజీల క్లారిటీ, కౌంటర్ ఇచ్చింది. బుగ్గన చెప్పినట్లుగా, హెరిటేజ్ కొన్న భూమి, అమరావతి రాజధాని పరిధిలోనే లేదని, అది అమరావతికి 20 కిమీ దూరంలో ఉన్న కంతేరు అనే గ్రామంలో కొన్నామని ప్రకటించారు. హెరిటేజ్‌ ఫుడ్స్‌ విస్తరణలో భగంగా, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నంలో భూములు కొని ప్లాంట్ లు పెట్టటానికి నిర్ణయం తెసుకున్నామని, ఇందులో భాగంగా, మార్చ్ 2014 అంటే ఎన్నికలకు ముందే, గుంటూరులో భూమి కొనుగోలు చెయ్యాలని, బోర్డు మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నామని, ఆ రోజు నోట్స్ కూడా చూడవచ్చని అన్నారు. రియల్ ఎస్టేట్ కోసం, ఈ భూమి కొనుగోలు చెయ్యలేదని, తమ ప్లాంట్ కోసమే చేసామని అన్నారు.

herigate 18122019 3

2014 మార్చిలో హెరిటేజ్ కు చెందిన బోర్డు భూమి కొనుగోలుకు నిర్ణయం తీసుకుంటే, జూన్ నెలలో, మొవ్వా శ్రీలక్ష్మి అనే మహిళకు చెందిన 7.21 ఎకరాలు, చిగురుపాటి గిరిధర్‌కు చెందిన 2.46 ఎకరాలు. ఎఈపీఎల్ సంస్థకు చెందిన 4.55 ఎకరాలను కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నామని, అయితే ఎల్‌ఈపీఎల్‌కు చెందిన 4.55 ఎకరాల పై వివాదం ఉండటంతో, ఆ స్థలం కొనుగోలు చెయ్యలేదని అంటున్నారు. బుగ్గన అసెంబ్లీలో 14 ఎకరాలు కొన్నమని అన్నారని, కాని మేము కొనుగోలు చేసింది, కేవలం 9.67ఎకరాలు అని అన్నారు. డిసెంబర్ లో రాజధాని ప్రకటన వస్తే, మేము ఎన్నికల ముందు మార్చ్ 2014లో నిర్ణయం తీసుకుని, జూన్ లో కొన్నామని గుర్తు చేసారు. అది కూడా రాజధాని ప్రాంతంలో లేదని, 20 కిమీ దూరంలో ఉందని బుగ్గనకు కౌంటర్ ఇచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read