నిన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం క్వస్చిన హావర్ సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు, రాష్ట్రంలో అప్రకటిత కరెంటు కోతల పై, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్బంగా, విద్యుత్ శాఖా మంత్రి బాలినేని, తెలుగుదేశం పార్టీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చోదరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎమ్మల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, ఐదేళ్లుగా ఎక్కడా కారెంటు కోతలు లేవని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి వచ్చిన ఆరు నెలల్లో అనేకసార్లు కరెంటు కోతలు విధించారని అన్నారు. గతంలో ఏ మాత్రం జరగని 3 వ్యాపారాలు జగన్ వచ్చిన తరువాత బాగా జరుగుతున్నాయని, మొదటిది క్యాండిల్స్, రెండోది జనరేటర్, మూడోది ఇన్వర్టర్ అన్నారు. బుచ్చయ్య చౌదరికి సమాధానంగా, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమాధానం ఇవ్వటానికి సిద్ధం అవుతూ ఉండగా, జగన్ మోహన్ రెడ్డి కల్పించుకుని, మైకు తీసుకుని, రాష్ట్రంలో విద్యుత పరిస్థితి, విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించబోయారు.
అయితే, సమాధానం చెప్పటానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ నెంబర్లు ఏమిటో చెప్పటానికి, జగన్ తడ బడ్డారు. దాదపుగా 5 నిమిషాలు జగన్, ఇలా చేస్తూ ఉండటంతో, అటు వైపు నుంచి తెలుగుదేశం ఎమ్మల్యేలు, కామెంట్లు చేస్తూ, సియంకు ఏమి తెలియదు అంటూ ఎగతాళి సెహ్సారు. దీంతో జగన్ ఇవి, 17 వేల మెగా యూనిట్లా? గంటలా?’ అంటూ అధికారుల గ్యాలరీలో ఉన్న ఎనర్జీ సెక్రటరీ శ్రీకాంత్‌ను ప్రశ్నించారు. ఆయన చెప్తూ ఉండగానే, ఇక్కడ కూడా అంతరాయమేనా? అంటూ టీడీపీ సభ్యులు ఎద్దేవా చేశారు. దీంతో అసహనానికి గురైన జగన్, మీకు బుర్రలేదు. అసలు ఇది నా సబ్జెక్ట్ కాదు, ఈ లెక్కలు నాకు ఎలా తెలుస్తాయి, నేను మీకు సమాధానం చెప్దామని లేగిసాను అంటూ చెప్పారు.
అయితే, కాసేపు మంత్రి బాలినేని, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిలతో చర్చించారు. అధికారులు స్లిప్పులు రాసి సీఎంకు పంపారు. ఇలా జరుగుతుండగానే, అర్థమైంది, ఇక అన్సర్ వద్దులెండి అంటూ టీడీపీ సభ్యులు మళ్ళీ అరవటంతో, జగన్ అసహనంతో కాసేపు అక్కడే కూర్చొని, మంత్రి బాలినేని చెప్పమని అన్నారు, తరువాత కొంచెం సేపటకి చాంబర్‌లోకి వెళ్లి పోయారు. అయితే ఈ విషయం పై చంద్రబాబు ఈ రోజు అనంతపురం కార్యకర్తల మీటింగ్ లో లేవనెత్తారు. తనకు ఇంగ్లీష్ రాదు అంటూ ఎద్దేవా చేసారని, నిన్న అసెంబ్లీ చూసారా, మనం విద్యుత్ పై అడిగితే, సమాధానం చెప్పలేక పారిపోయారు, మెగావాట్ కి, కిలోవాట్ కి తేడా తెలియదు ఈయనో ముఖ్యమంత్రి... సబ్జెక్ట్ తెలిస్తేగా అసలు మాట్లాడటానికి అంటూ జగన్ ను మళ్ళీ ఎద్దేవా చేసారు.