ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలనే అధికారంలోకి వచ్చాకకూడా వైసీపీ చేసిందని, ఆధారాలు లేకుండా సినిమాటిక్‌గా వీడియోలు ప్రదర్శించినంత మాత్రాన అవాస్తవాలు నిజాలుకావని టీడీపీ సీనియర్‌నేత, మాజీఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ స్పష్టంచేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఆత్మకూరులోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మరోనేత తెనాలిశ్రావణ్‌కుమార్‌తో కలిసి విలేకరులతో మాట్లా డారు. 01-06-2014నుంచి 30-12-2014వరకు కృష్ణా, గుంటూరుజిల్లాల్లో కలిపి దాదాపు 4వేల ఎకరాలు కొన్నారని, అదంతా ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌ అని వైసీపీచెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సెప్టెంబర్‌-2న శాసనసభలో రాజధానిపై ప్రకటన వచ్చిందని, అక్టోబర్‌-30న జరిగిన కేబినెట్‌సమావేశంలో కృష్ణానది ఒడ్డున రాజధాని వస్తుందని ప్రకటనచేయడం జరిగిందన్నారు. అక్టోబర్‌ తర్వాత జరిగిన భూలావాదేవీలు తీసుకొచ్చి ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌ అనడం నిరాధారమన్నారు. రాజధాని మార్చాలన్న ఆలోచన తోనే ఇదంతా చేస్తున్నారని ధూళిపాళ్ల తేల్చిచెప్పారు. 2019ఫిబ్రవరిలో జగన్‌ తాడేపల్లిలో గృహప్రవేశం చేశాడని, ఆ ఇంటిని ఎవరిదగ్గర నుంచి కొన్నారో స్పష్టంచేయాలన్నారు. కాంక్రీట్‌ అండ్‌ లైట్‌స్టోన్‌ ఇన్‌ఫ్రా యజమాని అనిల్‌కుమార్‌రెడ్డని, ఆయననుంచి కొన్నట్లు ఆధారాలున్నాయన్నారు. ఈకంపెనీ తాడేప ల్లి ప్రాంతంలో 2016నుంచి పెద్దఎత్తున భూములు కొన్నదని నరేంద్ర తెలిపారు.

dhulipalla 03012020 1

జగన్‌సతీమణి భారతి, సండూర్‌పవర్‌, హరీశ్‌ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీలు భూములు కొనుగోలుచేశాయని, ఆరెండు కంపెనీలు సీబీఐవిచారణ ఎదుర్కొంటున్నాయని, ఆయా కంపెనీలవెనుక జగన్‌భార్య భారతి, పీ.రమేశ్‌బాబు ఉన్నారన్నారు. ఆథరైజ్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఈ రమేశ్‌బాబుని తెరపైకి తీసుకొచ్చారన్నారు. భారీఎత్తున భూములుకొన్న కాంక్రీట్‌ అండ్‌ లైట్‌స్టోన్‌ ఇన్‌ఫ్రానుంచి, భారతి, సండూర్‌పవర్‌, హరీశ్‌ఇన్‌ఫ్రా కంపెనీ లు 2016లోనే భూములు కొనుగోలుచేశాయని ధూళిపాళ్ల పేర్కొన్నారు. 2016లోనే వారుకొన్న భూములడాక్కుమెంట్లు 1187,-12896-13,109,-13100-13,35 3,-12,915,-9385 నంబర్లతో ఉన్నాయని, ఇంతకన్నా రుజువేం కావాలని మాజీ ఎమ్మెల్యే నిలదీశారు. ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌ బూచినిచూపుతూ ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్న జగన్‌, ఇతరవైసీపీనేతలు, 2016లోనే రాజధాని ప్రాంతంలో పెద్దఎత్తునభూములు కొన్నారని, అది ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌ కిందకు రాదా అని ఆయన ప్రశ్నించారు. జగన్‌ ఉంటున్న ఇల్లు అసెంబ్లీకి కూతవేటుదూరంలోనే ఉందని, ఆఇల్లుఉన్న మూడుఎకరాలు ప్రత్యేకించి జగన్‌కోసమే కొనుగోలుచేసి, భారీభవంతిని నిర్మించి ఆయనకు కానుకగా ఇచ్చారన్నారు.

dhulipalla 03012020 1

భూములుకొని, ఇల్లుకట్టి జగన్‌కు ఇచ్చారంటే, వారుకచ్చితంగా ఆయన బినామీలేనన్నారు. వైసీపీనేతలు చెప్పినట్లు ఈ తతంగమంతా ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌ పరిధిలోకి రాదా అన్నారు. తాముకొంటే ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌ అంటున్నవారు, తమబినామీలతో పెద్దఎత్తున భూములు కొనడం, భారతి, సండూర్‌పవర్‌, హరీశ్‌ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పేర్లతో బదలాయించడం దేనికిందకు వస్తుందన్నారు. వై.ఎస్‌.భారతి ఫిబ్రవరి 8-2019లో భూములుకొన్నదని, మూడేళ్ల క్రితమే జగన్‌కోసం ఇంటినిర్మాణం మొదలైందని, అప్పుడు జరిగిందంతా ఇన్‌సైడ్‌, అవుట్‌సైడో అంబటి, ప్రకాశ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డే స్పష్టంచేయాలన్నారు. ఫిబ్రవరిలో భూమికొని, ఫిబ్రవరిలోనే గృహప్రవేశం చేయడం ఎలా సాధ్యమైందో వారేచెప్పాలన్నారు. టీడీపీనేతలను చూపించి రైతుల్ని బలిపశువుల్ని చేయకుండా, ఏవిచారణకు ఆదేశిస్తారో, దానిపరిధిలోకి భారతిని, సండూర్‌, హరీశ్‌ఇన్‌ఫ్రా కంపెనీల ను చేరుస్తారో లేదో ప్రభుత్వపెద్దలు చెప్పాలని నరేంద్ర డిమాండ్‌ చేశారు. ఇన్‌సైడ్‌ ్‌ట్రేడింగ్‌ అనేది జగన్‌కే సాధ్యమవుతుందన్నారు. కంపెనీలు పెట్టకుండానే రూ.10ల షేరు రూ.350వలకు అమ్మినవ్యక్తిగా ఆయనకే ఆఘనత దక్కుతుందన్నారు. టీడీపీనేతలు నిజంగా తప్పుచేస్తే చట్టప్రకారం చర్యలుతీసుకోవాలని, అదేసమయంలో వైసీపీనేతలు, జగన్‌ బినామీలనుకూడా శిక్షించాలని నరేంద్ర తేల్చిచెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read