జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమ్మఓడి పధకం పై ప్రజల్లో కూడా ఆసక్తి ఉంది. ఒకేసారి 15 వేలు ఇస్తారు అని చెప్పటంతో, పెద్ద ఎత్తున అప్లై చేసారు. అయితే జగన్ పాదయాత్రలో, ఎంత మంది పిల్లలు ఉన్నా అమ్మ ఓడి ఇసం అని చెప్పి, కేవలం ఒక్కరికే అని అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పారు. ఇక తరువాత కేవలం ప్రభుత్వం స్కూల్స్ కే అని, తరువాత కాదు, ప్రైవేటు స్కూల్స్ కి కూడా అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కొత్త జీవో వచ్చింది. దీని ప్రకారం, రాష్ట్రంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల్లో రూ. 12 వేలపైబడి జీతాలు అందుకుంటున్న వారి పిల్లలకు అమ్మ ఒడి పథకం వర్తించదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గురువారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నష్టపోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, అనుబంధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఈ పేస్కేల్ ఉన్నవారే.

ammavodi 03012020 2

గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ. లక్షా 20 వేలు, పట్టణ ప్రాంతాల్లో ఏడాదికి రూ. లక్షా 44 వేల కన్నా ఎక్కువ జీతాలు అందుకునే వారి కుటుంబాలన్నింటినీ అమ్మ ఒడికి అనర్హు లుగా పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు చేసుకుంటున్న లక్షలాది మంది అనర్హులుగా మారనున్నా రు. ఈ ఉద్యోగుల్లో ప్రైవేట్ పాఠశాలల్లో తమ పిల్లలను చదివిస్తున్న వారైతే మరింత ఇబ్బంది పడనున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు అమ్మఒడిని అందిస్తామని ప్రకటించడంతో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు ఆర్థికంగా భారమైనా కూడా తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేర్చారు. ఇప్పుడు తాజాగా వెలువడిన ఉత్తర్వులతో వారందరిపైనా భారం పడనుంది. మరో వారం రోజుల్లో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనుండగా.. అన్ని పాఠశాలల్లో అర్హుల జాబితాలు సిద్ధమైన తర్వాత ఈ ఆదేశాలు వెలువడటం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ammavodi 03012020 3

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించిన తుది జాబితాలు సిద్ధమవుతున్నాయి. మరో వారం రోజుల్లో పథకాన్ని ప్రారంభించాల్సి ఉండటంతో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఐదు రోజుల కార్యక్రమాల షెడ్యూల్ విడుదల చేశారు. మరోవైపు అన్ని అర్హతలు ఉండి, ఏవేని కారణాలతో అనర్హులుగా గుర్తించిన వారిని అర్హులుగా గుర్తించే అవకాశాన్ని డీఈవోలకు కల్పించారు. డీఈవోలు కార్యక్రమాన్ని ప్రారంభించే రోజు వరకు అర్హులకు సంబంధించిన మార్పులు చేయొచ్చు. ఐదు రోజుల ప్రణాళికలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో, అన్ని జూనియర్ కళాశాలల్లో పండుగ వాతావరణంలో నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు గురువారం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అమ్మ ఒడిని ప్రారంభించే రోజైన 9వ తేదీన అర్హులైన తల్లులు, సంరక్షకులను, గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులను ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఆహ్వానించాలని కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read