వై-ఎస్-వివే-క కేసు ఇప్పుడు హైకోర్ట్ లో ఉంది. గతంలో జగన ప్రతిపక్షంలో ఉండగా, ఈ కేసును సిబిఐకు ఇవ్వాలని, గొడవ గొడవ చేసారు. చంద్రబాబు ప్రభుత్వం పై నమ్మకం లేదని, సిబిఐ అయితేనే ఇలాంటి కేసులు తేల్చగలదని, వారు అయితేనే దోషులు ఎవరో బయట పడతారు అంటూ జగన్ గతంలో హడావిడి చేసారు. ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ, చంద్రబాబుని ఛాలెంజ్ చేసారు. అయితే అప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ రావటంతో, ఇది తమ పరిధిలోని అంశం కాదని, కేంద్రాన్ని అడగాలి అంటూ చంద్రబాబు అప్పట్లో కోరారు. అయినా సరే, అది చంద్రబాబే చేపించారు అంటూ, సొంత పత్రికలో కధనాలు కూడా రాసారు. చంద్రబాబు కత్తి పట్టుకుని వస్తున్నట్టు, కధనాలు చూపిస్తూ, మొత్తం చంద్రబాబు మీదకు నెట్టే ప్రయత్నం చేసారు. అయితే ప్రతిపక్షంలో ఉండగా, ఎవరైనా అలాగే రాద్ధాంతం చేస్తారు, కాని అధికారంలోకి వచ్చిన తరువాత కూడా, గతంలో తాము చెప్పిన మాటలకు కట్టుబడి ఉండకుండా, కాలయాపన చేస్తున్నారు.
గత ఏడు నెలల నుంచి ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తుంది. గతంలోనే మీరు కోరారు కదా, ఇప్పుడు ఇవ్వటానికి ఇబ్బంది ఏమిటి అంటూ అడుగుతున్నా, ప్రభుత్వం మాత్రం, ఏ మాత్రం స్పందించటం లేదు. గతంలో చంద్రబాబు వేసిన సిట్ కాకుండా, ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఒక సిట్ వేసారు. అదే తెలుస్తుంది అని చెప్పారు. అయితే, ఈ విషయంలో తమను అకారణంగా ఇరికిస్తున్నారని, ఏదో కుట్ర చేస్తున్నారని, ఈ కేసును సిబిఐకి అప్పగించాలి అని కోరుతూ, మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేత బీటెక్ రవి, హైకోర్ట్ లో వేరు వేరు కేసులు వేసారు. ఈ కేసుని సిబిఐ చేతే దర్యాప్తు చేపించాలని కోరారు. అప్పుడే సరైన న్యాయం బయటకు వస్తుందని పిటీషన్ వేసారు.
ఈ పిటీషన్ పై నిన్న హైకోర్ట్ లో వాదనలు జరిగాయి. ఈ సందర్భంలో అప్పట్లో మీరు సిబిఐ ఎంక్వయిరీ కోరారు కదా, ఇప్పుడు ప్రభుత్వంలోనే ఉన్నారు, సిబిఐకి ఇవ్వండి అంటూ, వస్తున్న ఆరోపణలకు, ప్రభుత్వ తరుపు అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం స్పందిస్తూ, గతంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయని, అందుకే అప్పుడు సిబిఐ ఎంక్వయిరీ అడిగామని, ఇప్పుడు అలాంటివి ఏమి అవసరం లేదని, సిట్ దర్యాప్తు బాగా జరుగుతుంది అంటూ, కోర్ట్ కు చెప్పారు. అయితే ఆదినారయణ రెడ్డి తరుపు లాయర్ స్పందిస్తూ, సిట్ దర్యాప్తు పై పలు అనుమానాలు ఉన్నాయని, అమాయకులని ఇరికించే ప్రయత్నం జరుగుతుందని, ప్రభుత్వ, డీజీపీ నియంత్రణ లేని సంస్థలతో , ఈ కేసు దర్యాప్తు చెయ్యాలని కోరారు. ఇరు పక్షాల వాదనల విన్న న్యాయమూర్తి తదుపరి విచారణ ఈనెల 8కి వాయిదా వేశారు.