అమరావతిలో రాజధాని రైతులకు అన్యాయం జరుగుతుంది అంటూ, గత 17 రోజులుగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడూ బయటకు రాని ఆడవాళ్ళు కూడా రోడ్డు మీదకు వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఈ రోజు నుంచి సకల జనుల సమ్మె కూడా, అమరావతిలో జరుగుతుంది. అన్ని పక్షాలు రాజధాని రైతుల పక్షాన పోరాడుతుంది. తమ గురించి ఆలోచించాలి అంటూ 17 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా, ప్రభుత్వం నుంచి ఎవరూ పట్టించుకోవటం లేదు. 17 రోజులుగా ఒక్క మంత్రి కాని, ముఖ్యమంత్రి కాని వారి తరుపున మాట్లాడ లేదు. ఇక స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వారి వైపు కూడా చూడటం లేదు. వారి ఆందోళన తగ్గించే మార్గం చెయ్యకుండా, వారితో చర్చలు జరపకుండా, వారిని పైడ్ అరిస్ట్ లు అంటూ హేళన చేస్తున్నారు. అలాగే ఇది ఎడారి అని, స్మశానం అని, ఇలా అనేక రకాలుగా రైతులని అవమాన పరుస్తున్నారు. తమ గురించి పట్టించుకోవాల్సిన ప్రభుత్వమే, ఇలా తమను రోడ్డున పడేసింది అని, తమ గురించి పట్టించుకోండి అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

jagan 0301220 2

అయితే, ఈ పరిస్థితిలో, ఈ రోజు ఏలూరులో, జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు హ్సుసారు. ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలెట్‌ ప్రాజెక్టును మొదలు పెట్టిన తరువాత, జగన్ మాట్లాడుతూ, రాజధాని మారిపోతుంది అంటూ, సంకేతాలు ఇచ్చేలా సంచలన వ్యాఖ్యలు హ్సుసారు. ప్రతి నిర్ణయానికి ప్రాతిపదిక.. అందరూ బాగుండాలి.. అన్ని ప్రాంతాలు బాగుండాలి. గ్రామం నుంచి రాష్ట్రం పరిపాలన వరకు అందరూ సమానమే. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, పరిపాలన ఫలాలు అందాలి. గతంలో అన్యాయంగా తీసుకున్న నిర్ణయాలను సరిదిద్దుతాం. అందరికీ నీరు, నిధులు, పరిపాలన దక్కితేనే న్యాయం చేస్తాం అంటూ, అమరావతి నుంచి రాజధాని మారిపోతుంది అనే విధంగా జగన్ మాట్లాడుతూ, రాజధాని మార్పు అనివార్యం అనే విధంగా చెప్పారు.

jagan 0301220 3

ఈ రోజు మధ్యానం బోస్టన్ కమిటీ మూడున్నర గంటలకు రిపోర్ట్ ఇవ్వనుంది. ఆ నివేదక రాకుండానే, జగన్ ఇలా మాట్లాడటం పై ఆసక్తి నెలకొంది. మొన్న కూడా జీఎన్ రావు కమిటీ నివేదిక ఇవ్వకుండానే, ఆయన అసెంబ్లీలో మూడు రాజధానుల పై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తరువాత జీఎన్ రావు అదే చెప్పారు. ఇప్పుడు కూడా బోస్టన్ కమటీ రాకుండానే, ఇలా ఎలా చెప్తారు అంటూ, వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఈ కమిటీలు ఎందుకు అంటూ, జగన్ నే ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోమని చెప్తున్నారు. అయితే మొన్న వైజాగ్ వెళ్ళిన జగన్, ఒక్క మాట కూడా మాట్లాడకుండా వచ్చేశారు. అక్కడ ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఏలూరులో ఎందుకు ఇలా మాట్లాడారు అనేదాని పై ఆసక్తి నెలకొంది. మొత్తానికి, అమరావతి రైతులని మాత్రం, పట్టించుకోవటం లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read