Sidebar

25
Sat, Jan

గత 2వారాలుగా అమరావతి రాజధానికి చెందిన రైతులు రాజధాని తరలింపు ప్రకటనలపై వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు. అయితే ఈ రోజు రైతులకు పోలీసులు నోటీసులు ఇవ్వటంతో, అమరావతి గరమల్లో కలకలం రేగింది.  వెలగపూడి, మల్కాపురం గ్రామాల రైతులకు వచ్చిన నోటీసులు చూసి, రైతులు ఆందోళన చెందారు. కొంత మంది రైతులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు, 307 కేసుతో పాటు మరో 7సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇవాళ సాయంత్రం 5గంటలకు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్‌కు ఆధార్ కార్డుతో రావాలని 15 మందికి పైగా రైతులు, రైతు కూలీలకు నోటీసులు అందాయి.  అయితే ఈ నోటీసులు పై స్పందించిన రైతులు, తాము ఎక్కడా అదుపు తప్పి ఆందోళనలు చెయ్యలేదని, శాంతియుతంగా అందోళన చేస్తున్నామని, తమను అణిచి వేయటానికి, తమను ఇలా భయపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. మీడియా పై దాడి చేసామని, కేసు పెట్టారని, జడ్జి అడిగితే ఆధారాలు చూపించలేక పోయారని, ఈ కేసులు  కూడా, తుళ్ళూరు స్టేషన్ పరిధిలో కాకుండా చిలకలూరిపేట, తెనాలి, గుంటూరు స్టేషన్లలో పెట్టారని అన్నారు.

notice 03012020 2

మరో పక్క, ఈ రోజు నుంచి ఉద్య-మం తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటి వరకు అఖిలపక్ష పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు భూములిచ్చిన రైతులకు మద్ద తుగా నిలుస్తున్నారు. ఇప్పటికే రైతులకు మద్దతుగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా నిత్యం ధర్నాలు, రాస్తారోకోలు జరిగి బస్సులు రాకపోకలకు అంతరాయం కలుగు తూనే ఉంది. కానీ ప్రభుత్వపరంగా రైతులకు సానుకూలంగా ఒక్కప్రకటన కూడా రాకపోగా మంత్రు లనుంచి రెచ్చగొట్టే ధోరణిలో ప్రకటనలు వస్తున్నాయి. దీంతో అమరావతి రాజధాని పరిది లోని 29 గ్రామాల రైతులందరూ మహాధర్నాకు దిగాలని రాజధాని వరిరక్షణ సమితి గురువారం పిలుపునిచ్చింది. అత్యవసర వైద్యం, పాలు, నీళ్ళు తప్పా అన్నింటిని అడ్డుకోవాలని ఈ సందర్భంగా రైతు కమిటి నిర్ణయించి కొనసాగించాలం టున్నారు. ఇకనుండి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా  నిర్వహించాలని ఇందుకోసం కేసులు, జైలు కెళ్ళేందుకు సిద్ధంగా ఉండాలని రైతులు భావిస్తున్నారు.

notice 03012020 3

రాజధాని రైతులు ఉత్తరాల ఉద్యమం ద్వారా రాష్ట్రపతికి లేఖలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తికి, గవర్నర్‌కు హైకోర్టు న్యాయమూర్తులు వ్రాయడం జరిగిందన్నారు. మహిళలు, విద్యార్థులు, పిల్లలతో సహా ఉత్తరాలు రాసిన విషయం తెలిసిందే. రాష్ట్ర రాజధానికి ఎంతో ఉదారంతో మూడు పంటలు పండే భూములను ఇష్టంలేక పోయినా రాష్ట్రా భివృద్ధి కోసం ప్రభుత్వానికి అందిస్తే ఇప్పుడు రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మా ప్రాంతం రైతాంగం ఆర్థికంగా నష్టపోవడం అధికార ప్రభుత్వానిక ఫ్యాషన్ గా ఉందని తెలియజేస్తు న్నారు. ఎస్టీ, బిసీలతోపాటు అసైన్డ్ రైతులు, లంకభూ ములు సాగుచేసే రైతులు కూడా పూర్తిగా ఆర్ధికంగా నష్టపోతున్నారని వాపోతున్నారు. ఒకే కులం, ఒకే పార్టీని బూచిగా చూపి రాజధానిని మార్చడం సరికాదని ఇప్పటికే మా భూములను గోతులుగా మార్చి, పిచ్చికంపతో అరణ్యాలను తలపిస్తున్నాయని అధికార ప్రభుత్వం మాగోడు ఆలకించి విముక్తి కలిగించాలని లేదంటే ఎన్ని రోజులైనా పోరాడతామన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read