ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా, ఇంకా చెప్పాలి అంటే, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా, మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చింది. సరిగ్గా 29 రోజుల క్రిందట జగన్ మోహన్ రెడ్డి, అసెంబ్లీలో ఈ ప్రకటన చేసారు. అప్పటి నుంచి, 29 రోజులుగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం, వారిని కనీసం పట్టించుకోవటం లేదు. ఏమి జరుగుతుందో కూడా పట్టించుకోవటం లేదు. ప్రజలు ఆందోళన చేస్తున్నారు, పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. ఎవరు ఎన్ని చేసినా, ప్రభుత్వానికి చీమ కుట్టిన కూడా లేదు. అయితే, ఇప్పుడు ఈ మూడు రాజధానుల విషయంలో మాత్రం, జగన్ కు ఒక అతి పెద్ద బ్రేక్ పడే అవకాసం ఉంది. ఇప్పుడు అదే జగన్ అండ్ కో ని టెన్షన్ పెడుతున్న అంశం. మూడు రాజధానుల విషయంతో, పాటుగా దానికి సంబంధించిన రెండు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్ట బోతుంది. అయితే, తెలివిగా, ఎక్కడా న్యాయపరంగా దొరక్కుండా, ఈ బిల్ తెసుకువచ్చే ఆలోచన చేస్తున్నారు.
ఎక్కడా రాజధాని తరలిస్తాం అని చెప్పకుండా, అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి పేరుతొ, ఈ బిల్ ఉంటుంది. దీని కోసం, ఇప్పటికే ఈ నెల 20న అసెంబ్లీ సమావేశం, తరువాత శాసన మండలి సమావేశం పెట్టరు. ఇక్కడే జగన్ మోహన్ రెడ్డికి టెన్షన్ మొదలైంది. సెక్రటేరియట్ ని విశాఖపట్నంకి తరలించటం, జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ, హైపవర్ కమిటీ నివేదికల పై, అసెంబ్లీలో చర్చించి, తరువాత, ఏపీసీఆర్డీఏ చట్టం రద్దు, అధికార వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి చట్టానికి సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టి, వాటిని ఆమోదింప చేసుకోవాలని జగన్ మోహన్ రెడ్డి ప్లాన్. అయితే, అసెంబ్లీలో ఈ బిల్లులు ఆమోదించుకోవటానికి, జగన్ మోహన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆయనకు అక్కడ ఫుల్ మెజారిటీ ఉంది.
అయితే శాసనమండలిలో మాత్రం, అలా కాదు. అక్కడ తెలుగుదేశం పార్టీకి 26 మంది ఉంటే, వైసీపీకి కేవలం 9 మంది మాత్రమే ఉన్నారు. ఇక విపక్షాలు అయిన, బీజేపీ కి మూడు, పీడీఎఫ్ కు 5, ఇండిపెండేట్ లు నలుగురు ఉన్నారు. దీంతో ఇక్కడ విపక్షాలది పై చేయి అవుతుంది. ఈ బిల్లు ఇక్కడ పాస్ అయ్యే అవకాశమే లేదు. అందుకే జాయింట్ సమావేశాలు పెట్టి, బిల్లు ఆమోదించాలని అనుకున్నారు. అయితే, జాయింట్ సిట్టింగ్ కి కొన్ని షరతులున్నాయి.మనీ బిల్లులు, రాజ్యాంగ సవరణ లాటి వాటికి జాయింట్ సెషన్ పెట్టకూడదు. అందుకే ఇప్పుడు శాసనమండలి టెన్షన్ పట్టుకుంది. ఇది కూడా అధిగమించి, ఆర్డినెన్సులను జారీ చేసే అంశం పై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, జరుగుతున్న ఆందోళన ద్రుష్టిలో పెట్టుకుని, గవర్నర్ ఈ ఆర్డినెన్సు కు ఆమోదం తెలపకపోతే ఏమి చెయ్యాలి అనే అంశం పై కూడా జగన్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరి ఇవన్నీ ఎలా అధిగమిస్తారో చూడాలి.