ఎన్నికలు ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తరువాత ఒక మాట.. సహజంగా ఏ రాజకీయ పార్టీ తీరు అయినా ఇలాగే ఉంటుంది. అయితే జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం, పాదయాత్రలో ఒక మాట చెప్తూ ఉండే వారు. మాట తప్పను మడం తిప్పను, ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ బాగు చెయ్యటానికి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ, ఆయాన చేసిన ప్రచారం చూసి అందరూ, ఆయన్ను నమ్మి, అందలం ఎక్కించారు. అయితే, ఆయాన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మాట తప్పి, మడం తిప్పుతూనే ఉన్నారు. 45 ఏళ్ళకు పెన్షన్ కాని, సన్న బియ్యం కాని, సీపీఎస్ కాని, తిత్లీ సహాయం కాని, ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే ఆయన సొంత బాబాయ్ కి సంబంధించిన కేసులో కూడా, జగన్ వెనక్కు తగ్గారు. ఎన్నికల ముందు వైఎస్ వి-వేక కేసు పై, సిబిఐ విచారణ జరపాలి అంటూ, ప్రతి రోజు జగన్ మోహన్ రెడ్డి, తన ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పే వారు. ఇది చంద్రబాబు చేయించారని, చంద్రబాబు గతంలో ఎంతో మందిని ఇలాగే చేసారు అంటూ ప్రచారం చేసారు.
అయితే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే, ఈ కేసుని సిబిఐకి ఇస్తారని అందరూ అనుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఊసే లేదు. గతంలో చంద్రబాబు వేసిన సిట్ ని తీసేసి, కొత్తగా సిట్ వేసారు. అది కూడా చాలా రోజులు ఆక్టివ్ గా లేదు. గత నెల, రెండు నెలల నుంచి ఆక్టివ్ అయ్యారు. అయితే, ప్రతిపక్షాలు అన్నీ సిబిఐకి ఇవ్వండి, మీరే కదా గతంలో కోరారు అంటే, ఆ విషయం పై ప్రభుత్వం మాట్లాడటం లేదు. మరో పక్క సిట్ కావాలని ప్రత్యర్దులని ఇబ్బంది పెడుతుంది, ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలి అంటూ, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు. ప్రభుత్వం తమని కావాలని టార్గెట్ చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో కాకుండా విచారణ జరపాలని కోరారు.
దీంతో ఈ కేసు హైకోర్ట్ లో విచారణ జరుగుతుంది. ఈ రోజు జరిగిన విచారణలో, జగన్ గారి ప్రభుత్వం, ఈ కేసుని, సిబిఐకి బదిలీ చెయ్యాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించారు. ఇప్పటికే ప్రభుత్వం, సిట్ విచారాణకు ఆదేశాలు ఇచ్చిందని, ఈ విచారణ కూడా చివరకు వచ్చిందని, అందుకే సిబిఐ విచారణ అవసరం లేదని వాదనలు వినిపించారు. అడ్వకేట్ జనరల్ కోర్టుకు ఈ విషయం తెలిపారు. దీని పై వాదనలు విన్న హైకోర్ట్, కేసుని ఈ నెల 20కి వాయిదా వేసింది. తదుపరి విచారణ ముగిసేవరకు, తుది నివేదికను స్థానిక కోర్టులో దాఖలు చేయొద్దని సిట్ కు హైకోర్ట్ ఆదేశించింది. అలాగే ఈ కేసుకు సంబంధించి వి-వేకా భార్య వేసిన అనుబంధ పిటిషన్‌పై ఈ నెల 19లోగా కౌంటర్లు దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్ ని హైకోర్టు ఆదేశించింది.